తిరుమలలో తప్పిన పెను ప్రమాదం

ABN , First Publish Date - 2022-04-11T19:28:56+05:30 IST

తిరుమలలో పెను ప్రమాదం తప్పింది.

తిరుమలలో తప్పిన పెను ప్రమాదం

తిరుమల: తిరుమలలో పెను ప్రమాదం తప్పింది. రాంబగీచ బస్టాండ్ సమీపంలో కారు బ్రేక్ ఫెయిల్ అయ్యి భక్తులపైకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో ఇద్దరు భక్తులకు తీవ్ర గాయాలయ్యాయి. మహిళ భక్తురాలికి రెండు కాళ్ళు విరిగిపోగా... మరో భక్తుడికి ఎడమ కాలు ఫ్రాక్చర్ అయ్యింది. విషయం తెలిసిన వెంటనే పోలీసులు అక్కడకు చేరుకుని కారు డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. 

Updated Date - 2022-04-11T19:28:56+05:30 IST