ఆ ఫేస్‌బుక్‌ అకౌంట్‌ నాది కాదు: రమణ దీక్షితులు

ABN , First Publish Date - 2020-04-03T08:58:15+05:30 IST

ఆ ఫేస్‌బుక్‌ అకౌంట్‌ నాది కాదు: రమణ దీక్షితులు

ఆ ఫేస్‌బుక్‌ అకౌంట్‌ నాది కాదు: రమణ దీక్షితులు

తిరుమల, ఏప్రిల్‌ 2: తన పేరుపై గుర్తుతెలియని వ్యక్తులు ఫేస్‌బుక్‌లో నకిలీ ఖాతా తెరిచి తప్పుడు ప్రచారం చేస్తున్నారంటూ టీటీడీ గౌరవ ప్రధాన అర్చకుడు రమణ దీక్షితులు తిరుమల పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఫేస్‌బుక్‌లో ‘రమణ దీక్షితులు’ అనే పేరుతో భక్తుల మనోభావాలు దెబ్బతీసేలా పోస్టులు పెట్టడాన్ని గుర్తించిన ఆయన ఆ వ్యక్తులపై తగిన చర్యలు తీసుకోవాలంటూ బుధవారం రాత్రి ఫిర్యాదు చేయగా, పోలీసులు కేసు నమోదు చేశారు. ఆయన ఫిర్యాదు చేసిన కొన్ని గంటల్లోనే ఆ నకిలీ ఖాతా మాయం కావడం విశేషం. 

Updated Date - 2020-04-03T08:58:15+05:30 IST