chennai: తిరుచ్చి క్రీడాకారిణులకు విద్యుత్‌బోర్డులో ఉద్యోగాలు

ABN , First Publish Date - 2021-10-12T17:07:56+05:30 IST

టోక్యో ఒలింపిక్స్‌లో రన్నింగ్‌లో అత్యంత ప్రతిభ కనబరచిన ఇద్దరు క్రీడాకారిణులకు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌ ఉద్యోగ నియామక పత్రాలను అందజేశారు. జూలై 30న జరిగిన పోటీల్లో తిరుచ్చి జిల్లాకు చెం

chennai: తిరుచ్చి క్రీడాకారిణులకు విద్యుత్‌బోర్డులో ఉద్యోగాలు

               - నియామక ఉత్తర్వులందజేసిన సీఎం స్టాలిన్‌


చెన్నై: టోక్యో ఒలింపిక్స్‌లో రన్నింగ్‌లో అత్యంత ప్రతిభ కనబరచిన ఇద్దరు క్రీడాకారిణులకు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌ ఉద్యోగ నియామక పత్రాలను అందజేశారు. జూలై 30న జరిగిన పోటీల్లో తిరుచ్చి జిల్లాకు చెందిన క్రీడాకారిణులు వి.శుభ, ఎస్‌.ధనలక్ష్మి రన్నింగ్‌ రేసులో పాల్గొని తమ ప్రతిభాపాటవాలను ప్రదర్శించారు. రాష్ట్ర ప్రభుత్వం ఒలింపిక్‌ క్రీడలలో పతకాలు గెలుచుకున్నవారికి భారీ నగదు సహాయాలు, అత్యంత ప్రతిభను ప్రదర్శించిన క్రీడాకారులకు వారి విద్యార్హత లను బట్టి ఉద్యోగాలు కల్పిస్తోంది. ఆ మేరకు సోమవారం ఉదయం సచివాలయంలో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో తిరుచ్చి మహిళా అథ్లెట్లు శుభ, ధనలక్ష్మిలకు విద్యుత్‌ బోర్డులో స్పోర్ట్స్‌ కోటా కింద ఉద్యోగాలు కల్పిస్తూ ముఖ్యమంత్రి స్టాలిన్‌ వారికి నియామక ఉత్తర్వులు అందజేశారు. ఈ కార్యక్రమంలో విద్యుత్‌ శాఖ మంత్రి వి.సెంథిల్‌బాలాజీ, విద్యుత్‌ ఉత్పాదక సంస్థ మేనేజింగ్‌ డైరెక్టర్‌ రాజేష్‌ లఖానీ, ఇంధన శాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ ధర్మేంద్ర ప్రతాప్‌ యాదవ్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2021-10-12T17:07:56+05:30 IST