Srirangam Ranganathaswamy: శ్రీరంగంలో వైభవంగా పవిత్రోత్సవం

ABN , First Publish Date - 2022-09-14T14:08:17+05:30 IST

భూలోక వైకుంఠంగా ప్రసిద్ధిచెందిన తిరుచ్చి శ్రీరంగం రంగనాథస్వామి(Tiruchi Srirangam Ranganathaswamy) ఆలయంలో పవిత్రోత్సవాలు

Srirangam Ranganathaswamy: శ్రీరంగంలో వైభవంగా పవిత్రోత్సవం

ప్యారీస్‌(చెన్నై), సెప్టెంబరు 13: భూలోక వైకుంఠంగా ప్రసిద్ధిచెందిన తిరుచ్చి శ్రీరంగం రంగనాథస్వామి(Tiruchi Srirangam Ranganathaswamy) ఆలయంలో పవిత్రోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా మంగళవారం ఉదయం ఉభయ నాంచారులతోనంపెరుమాళ్‌కు విశేష అలంకరణ, మహా దీపారాధన, పూజలు నిర్వహించారు. పవిత్రోత్సవాల్లో ప్రధానాంశంగా సోమవారం రాత్రి స్వామివారు కొలువుదీరిన గర్భగుడి ప్రాకారంలో ధాన్యం రాశులు పోసి ధాన్యం కొలత వేడుకలు నిర్వహించారు. ఈ నెల 6వ తేది నుంచి లోక కల్యాణార్ధం ప్రారంభించిన 9 రోజుల పవిత్రోత్సవాల్లో భక్తులు పెద్దసంఖ్యలో పాల్గొంటున్నారు. ఈ నెల 14, బుధవారం ఉదయం 10 గంటలకు నంపెరుమాళ్‌కు ఆలయ ప్రాంగణంలోని చంద్ర పుష్కరిణిలో నిర్వహించే తీర్ధవారితో పవిత్రోత్సవాలు సమాప్తి అవుతాయని ఆలయ అధికారులు తెలిపారు.

Updated Date - 2022-09-14T14:08:17+05:30 IST