Abn logo
Sep 21 2021 @ 09:25AM

తిరుచ్చులి సమీపంలో పురాతన శిల్పం

ప్యారీస్‌(చెన్నై): విరుదునగర్‌ జిల్లా తిరుచ్చులి తాలూకా పరిధిలోని తిరుచ్చులి గ్రామంలో పాఠశాల ప్రహరీ నిర్మించేందుకు చేపట్టిన తవ్వకాల్లో సుమారు 400 ఏళ్లనాటి పురాతన రాతి శిల్పం లభ్యమైంది. తిరుచ్చులి ప్రాంతంలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలకు ప్రహరీ నిర్మించేందుకు పాఠశాల విద్యాశాఖ నిధులు మంజూరు చేసింది. ఇందుకోసం చేపట్టిన తవ్వకాల్లో బయల్పడిన పురాతన శిల్పాన్ని అరుప్పుకోట దేవాంగర్‌ ఆర్ట్స్‌ కళాశాల ప్రొఫెసర్‌ రమేష్‌, రామనాథపురం పురావస్తు విభాగం అధ్యక్షుడు రాజగురు సోమవారం ఉదయం పరిశీలించారు. యుద్ధంలో వీరమరణం పొందిన అమరుల జ్ఞాపకార్థం ఇలాంటి రాతి విగ్రహాలను చెక్కే సంస్కృతి విరుదునగర్‌ జిల్లాలో 400 ఏళ్ల క్రితమే వుండేదని అధికారులు తెలిపారు.