Abn logo
Oct 26 2021 @ 07:37AM

Tiruchendur ఆలయంలో ప్రత్యేక వసతులు

పెరంబూర్‌(Chennai): తిరుపతి వెంకటేశ్వరస్వామి ఆలయంలో ఉన్నట్టు తిరుచెందూర్‌ ఆలయంలో కూడా దర్శనానికి వచ్చి వేచి వుండే భక్తులకు ప్రత్యేక సీట్ల వసతి కల్పించారు. రాజగోపురం సమీపంలోని కావేరి మండపంలో ‘భక్తులు వేచి ఉండు ప్రాంతం’ పేరిట 408 కుర్చీలు ఏర్పాటయ్యాయి. ఈ ప్రాంతంలో భక్తులకు తాగునీటి వసతి, ఫ్యాన్‌ సౌకర్యం కల్పించారు. ఆదివారం తెల్లవారుజామున 4 గంటలకు ప్రత్యేక పూజల అనంతరం దర్శనానికి వచ్చిన భక్తులను ఆలయ జాయింట్‌ కమిషనర్‌ అన్బుమణి ఆహ్వానించి, సీట్లలో కూర్చొబెట్టారు. కాగా, కరోనా లాక్‌డౌన్‌ సడలింపులతో ఆరు నెలల అనంతరం ఆదివారం సాయంత్రం 6 గంటలకు బంగారు రథం పూజలు నిర్వహించారు.

ఇవి కూడా చదవండిImage Caption