తిరంగా ర్యాలీలు.. సాంస్కృతిక, క్రీడా పోటీలు

ABN , First Publish Date - 2022-08-15T04:58:32+05:30 IST

స్వాతంత్య్ర వజ్రోత్సవాలు జిల్లాలో ఘనంగా జరుగుతున్నాయి. అల్ఫోర్స్‌ విద్యాసంస్థల, జిల్లా సైక్లింగ్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో ఆదివారం నగ రంలో తిరంగా ర్యాలీ నిర్వహించారు.

తిరంగా ర్యాలీలు.. సాంస్కృతిక, క్రీడా పోటీలు

కరీంనగర్‌ స్పోర్ట్స్‌, ఆగస్టు 14: స్వాతంత్య్ర వజ్రోత్సవాలు జిల్లాలో ఘనంగా జరుగుతున్నాయి. అల్ఫోర్స్‌ విద్యాసంస్థల, జిల్లా సైక్లింగ్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో ఆదివారం నగ రంలో తిరంగా ర్యాలీ నిర్వహించారు. తెలంగాణ చౌక్‌లో అల్ఫోర్స్‌ విద్యాసంస్థల అధినేత డాక్టర్‌ వి నరేందర్‌రెడ్డి జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం శాతవాహన విశ్వవిద్యాలయంలో అండర్‌-14, 16, 18, 23, 23 సంవత్స రాలకు పైగా బాలబాలికలకు జిల్లాస్థాయి సైక్లింగ్‌ పోటీలు నిర్వహించారు. ఈ పోటీల్లో ప్రతిభ కనబరిచిన క్రీడాకారు లను రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపిక చేసినట్లు నిర్వాహకులు పేర్కొన్నారు. స్థానిక టీఆర్‌ఎస్‌ నాయకుడు కోల ప్రశాంత్‌ ఆధ్వర్యంలో రాగి జావ, కోడిగుడ్లు, మొలకలు, అరటి పండ్లను పంపిణీ చేశారు. ఈ పోటీలకు ఉమ్మడి జిల్లా నుంచి సుమారు 350 మందికిపైగా క్రీడాకారులు పాల్గొ న్నారు. ఈ కార్యక్రమంలో ప్రతినిధులు ఇ రమేశ్‌, వి జగదీ శ్వరాచారి, తిరుపతిరెడ్డి, ఎస్‌జీఎఫ్‌ ప్రతినిధులు శంకరయ్య, రవి తదితరులు పాల్గొన్నారు. 

 జిల్లా జైలులో...

కరీంనగర్‌ క్రైం : అజాదీకా అమృత్‌ ఉత్సవాల సందర్భం గా కరీంనగర్‌ జిల్లా జైలులో ఆదివారం సాంస్కృ తిక కార్యక్రమాలను నిర్వహించారు. ఖైదీలచేత పాటు, నృత్య ప్రదర్శనలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జైల్‌ సూప రింటెండెంట్‌ జీ సమ్మయ్య, జిల్లా సబ్‌ జైళ్ళ అధికారి కే శ్రీనివాస్‌, జైలు వైద్య అధికారి జీ రమేష్‌, జైలర్‌ బీ రమేష్‌, డిప్యూటీ జైలర్‌లు ఏ శ్రీనివాస్‌రెడ్డి, ఎస్‌ సుధాకర్‌రెడ్డి, ఎల్‌ రమేష్‌ సిబ్బంది పాల్గొన్నారు. 

క్రైస్తవుల శాంతి ర్యాలీ

 కరీంనగర్‌ కల్చరల్‌ : భారత స్వాతంత్య్ర వజ్రోత్సవాల సందర్భంగా ఆదివారం కోర్టు చౌరస్తా నుంచి నగరవీధుల గుండా క్రైస్తవులు శాంతి ర్యాలీ నిర్వహించారు. ఈ కార్య క్రమంలో పాస్టర్లు తిమోతీ జయరాజ్‌, ఎలీ షా, అనోక్‌రాజ్‌, అరుణ్‌, క్రిష్టఫర్‌, గిద్యోన్‌, కార్పొరేటర్‌ పెద్దపల్లి జితేందర్‌, బండ రమణారెడ్డి, తిమోతీ సురేశ్‌, జాన్‌ దినకర్‌ తదితరులు పాల్గొన్నారు. 

పోస్టల్‌ శాఖ ఆధ్వర్యంలో క్రీడా పోటీలు

 కరీంనగర్‌ స్పోర్ట్స్‌ : వజ్రోత్సవాలను పురస్క రించుకొని ఆదివారం కరీంనగర్‌ డివిజన్‌ పోస్టల్‌శాఖ ఆధ్వర్యంలో స్థానిక పీవీ నరసింహారావు తెలంగాణ పశు వైద్య విశ్వ విద్యాలయం మైదానంలో పోస్టల్‌ ఉద్యోగుల క్రికెట్‌ పోటీలు ఉత్సాహంగా జరిగాయి. డివిజన్‌లోని ఉద్యో గులు జట్లుగా విడిపోయి పోటీపడ్డారు. పోటీలను పోస్టల్‌ ఎస్‌పీ వై వెంకటేశ్వర్లు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఐపీవోలు చంద్రమోహన్‌, రాజు, పవన్‌, రఘుమోహన్‌, పోస్టల్‌ ఉద్యోగులు పాల్గొన్నారు. 

జిల్లా కేంద్రంలోని కశ్మీర్‌గడ్డ వాకర్స్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో ఆదివారం ఉదయం ఫ్రీడం ర్యాలీ నిర్వహిం చారు. మహిళా డిగ్రీ కళాశాల ఎదుట ప్రారంభమైన ఈ ర్యాలీటుటౌన్‌ పోలీస్‌స్టేషన్‌ మీదుగా తెలంగాణ చౌక్‌ వరకు సాగింది. అనంతరం ఆర్ట్స్‌ కళాశాలలోని పెద్ద జాతీయ జెండా వద్ద జనగణమన పాడి ముగించారు. ఈ కార్యక్ర మంలో వాకర్స్‌ అసోసియేషన్‌ ప్రధాన కార్యదర్శి మధుసూ దనాచారి, సభ్యులు రామకృష్ణ, ప్రసాద్‌, బాబా బాయి, సైఫొద్దీన్‌, సాగర్‌, శ్రీనివాస్‌, ప్రసాద్‌ పాల్గొన్నారు. 

హుజూరాబాద్‌లో...

 హుజూరాబాద్‌ : బీజేపీ హుజూరాబాద్‌ పట్టణ శాఖ, మున్సిపాలిటీ ఆధ్వర్యంలో అమృత్‌ మహోత్సవాల్లో భాగం గా సర్దార్‌ వల్లభాయ్‌ పటేల్‌, డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌, స్వామి వివేకానంద, చాకలి అయిలమ్మ, మహాత్మాగాంధీ విగ్రహాలను శుద్ధి చేసి పూలమాలలతో అలంకరించారు. అలాగే పట్టణంలోని అంబేద్కర్‌ చౌరస్తా వద్ద మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ గందె రాధిక ఆధ్వర్యంలో జానపద కళాకారుల చేత సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. వీఎస్సార్‌ డిగ్రీ కళాశాల ఆధ్వర్యంలో మానవహారం నిర్వహించి ర్యాలీ తీశారు. కార్యక్రమంలో గంగిశెట్టి రాజు, ముత్యంరావు, నల్ల సుమన్‌, తూర్పాటి రాజు, పల్లెని దేవేందర్‌రావు, రోహిత్‌, ప్రభాకర్‌, వేణు, విజయ్‌, చంద్రిక, శశిధర్‌, చిరంజీవి తదితరులు పాల్గొన్నారు.

 జమ్మికుంట: పట్టణంలో గాంధీజీ, డాక్టర్‌ బీఆర్‌ ఆంబేద్కర్‌ విగ్రహాలకు బీజేపీ పట్టణ అధ్యక్షుడు జీడి మల్లేష్‌ ఆధ్వర్యంలో నాయకులు క్షీరాభిషేకం నిర్వహిం చారు.  కార్యక్రమంలో నాయకులు ఇటికల స్వరూప, ఎదులపురం ఆశోక్‌, కంకణాల రమారెడ్డి, కైలాసకోటి గణేష్‌, తిరుపతి, శ్రీనివాస్‌, రాజేష్‌, శ్రీను, రాకేష్‌, రవి, తిరుప తయ్య, తదితరులు పాల్గొన్నారు.  పట్టణంలోని ఆంబేద్కర్‌ చౌరస్తా నుంచి గాంధీ చౌరస్తా వరకు ఆదివారం ముస్లింలు భారీ ర్యాలీ నిర్వహించారు.  కార్యక్రమంలో మున్సిపల్‌ చైర్మన్‌ తక్కళ్లపల్లి రాజేశ్వర్‌రావు, కమిషనర్‌ సమ్మయ్య, తదితరులు పాల్గొన్నారు. 

 వీణవంక: మండలంలోని చల్లూరు గ్రామంలోని మహాత్మ గాంధీ విగ్రహాన్ని  బీజేపీ నాయకులు నీటితో శుద్ధి చేసి క్షీరాభిషేకం నిర్వహించారు. అలాగే దేశ విభజన భయానక స్మారక దినోత్సవాన్ని పురస్కరించుకొని గ్రామం లో ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో నాయకులు రామి డి ఆదిరెడ్డి, నరసింహరాజు, పెద్ది మల్లారెడ్డి, ముత్యాల రవీందర్‌, విజయ శ్రీనివాస్‌, కుమా రస్వామి, రాజ్‌కుమార్‌, నవీన్‌, లక్ష్మయ్య, శ్రీనివాస్‌, మహేందర్‌రెడ్డి పాల్గొన్నారు. 

 మానకొండూర్‌: మానకొండూర్‌లో ఆదివారం జానపద కళాకారుల ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి.  ఆయా కార్యక్రమాల్లో జడ్పీటీసీ తాల్లపల్లి శేఖర్‌గౌడ్‌, ఎంపీపీ ముద్దసాని సులోచన, తహసీల్దార్‌ లక్ష్మారెడ్డి, ఎంపీడీవో దివ్యదర్శన్‌రావు, గ్రామ సర్పంచ్‌ రొడ్డ పృథ్వీరాజ్‌, ఎంపీటీసీలు ఉండింటి సులోచన, పిట్టల కవిత, ప్రజాప్రతినిధులు, అధికారులు, కళాకారులు పాల్గొన్నారు. 

 చొప్పదండి: చొప్పదండిలో నిర్వహించిన ర్యాలీని జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ ఏనుగు రవీందర్‌రెడ్డి ప్రారంభించారు. కార్యక్రమంలో మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ ఇప్పనపల్లి విజయలక్ష్మీ, ఎంపీపీ చిలుక రవీందర్‌, విండో చైర్మన్‌ వెల్మ మల్లారెడ్డి, నాయకులు ఆరెల్లి చంద్రశేఖర్‌, కొత్త గంగారెడ్డి, నాయకులు, ప్రజలు పాల్గొన్నారు. 

 గంగాధర: మండలంలోని గర్షకుర్తి గ్రామంలో పార్టీ మండల కన్వీనర్‌ పొత్తూరి సురేశ్‌ ఆధ్వర్యంలో స్వాతంత్య్ర వజ్రోత్సవ ర్యాలీని బీఎస్పీ జిల్లా ఇన్‌చార్జి నల్లాల రాజేందర్‌  నిర్వహించారు. కార్యక్రమంలో సెక్టార్‌ కార్యదర్శి గుంటుక లవకుమార్‌, మల్లయ్య తదితరులు పాల్గొన్నారు. 


Updated Date - 2022-08-15T04:58:32+05:30 IST