Oct 20 2021 @ 03:41AM

29న ‘తీరం’

శ్రావణ్‌ వైజీటీ, అనిల్‌ ఇనమడుగు, క్రిష్టెన్‌ రవళి, అపర్ణ హీరోహీరోయిన్లుగా నటించిన ‘తీరం’ చిత్రం ఈ నెల 29న విడుదల కానుంది. చిత్రదర్శకుడు, హీరోల్లో ఒకరైన అనిల్‌ మాట్లాడుతూ ‘యూత్‌ఫుల్‌ రొమాంటిక్‌ ఎంటర్‌టైనర్‌గా ఈ చిత్రాన్ని రూపొందించాం. నిర్మాణపరంగా ఎక్కడా రాజీ పడలేదు. సక్సెస్‌ విషయంలో కాన్ఫిడెంట్‌గా ఉన్నాం’ అని చెప్పారు.


తమ సంస్థ ద్వారా అత్యధిక థియేటర్లలో ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నట్లు సినేటెరియా గ్రూప్‌ అధినేత వెంకట్‌ బొలేమోని చెప్పారు. సినిమాకు సంగీతం హైలైట్‌గా నిలుస్తుందని ఆయన తెలిపారు.