చెమటపొక్కులకు చెక్‌!

ABN , First Publish Date - 2020-05-26T16:15:48+05:30 IST

వేసవిలో వేధించే సమస్య చెమటపొక్కులు. దురద, మంటతో విసిగించే చెమటపొక్కుల నుంచి ఉపశమనం పొందాలంటే కొన్ని చిట్కాలు పాటించాలి.

చెమటపొక్కులకు చెక్‌!

ఆంధ్రజ్యోతి(26-05-2020)

వేసవిలో వేధించే సమస్య చెమటపొక్కులు. దురద, మంటతో విసిగించే చెమటపొక్కుల నుంచి ఉపశమనం పొందాలంటే కొన్ని చిట్కాలు పాటించాలి.


చల్లని స్నానం: చల్లనీళ్ల స్నానంతో చెమటపొక్కుల బాధ తగ్గడంతో పాటు, పొక్కులు త్వరగా మానిపోతాయి. చర్మరంధ్రాలు మూసుకపోవడం వల్ల తలెత్తే చెమటపొక్కులు వదలాలంటే చర్మరంధ్రాలు తెరుచుకునేలా చర్మాన్ని సున్నితంగా రుద్దుకుంటూ స్నానం చేయాలి. అలాగే స్నానం తర్వాత తడి లేకుండా తుడుచుకోవాలి.


చెమట పట్టకుండా: గాలి ధారాళంగా ఒంటికి తగిలేలా చూసుకోవాలి. ఇందుకోసం వదులుగా, చెమట పీల్చుకునే దుస్తులు ధరించాలి.


ఉపశమనం కోసం: చల్లని నీటిలో తడిపిన వస్త్రంతో చెమటపొక్కులు ఉన్న ప్రదేశాన్ని కప్పుకోవడం, ఐస్‌ప్యాక్‌ పెట్టుకోవడం వల్ల ఉపశమనం దక్కుతుంది.


ఓట్‌మీల్‌: ఒకటి లేదా రెండు కప్పుల ఓట్‌మీల్‌ను గోరువెచ్చని నీళ్లు నింపిన స్నానపు తొట్టిలో కలిపి, ఆ నీళ్లలో కనీసం 20 నిమిషాల పాటు సేద తీరాలి. లేదంటే ఓట్‌మీల్‌, నీళ్లను సమపాళ్లలో కలిపి చెమటపొక్కులు తలెత్తిన చోట పూసుకోవాలి.


గంధం: గంధం పొడిలో నీళ్లు కలిపి పేస్ట్‌లా చేసి, చర్మం మీద పూసుకుంటే ఉపశమనం లభిస్తుంది. 


సోడా ఉప్పు: 3 నుంచి 5 టేబుల్‌ స్పూన్ల సోడా ఉప్పును నీళ్లు నింపిన స్నానపు తొట్టిలో కలిపి, ఆ నీళ్లలో 20 నిమిషాల పాటు సేద తీరినా చెమటపొక్కులు తగ్గుతాయి.


వేప పొడి: వేప పొడికి నీళ్లు చేర్చి, ముద్దలా చేసి పొక్కిన చర్మం మీద పట్టు వేయాలి.

Updated Date - 2020-05-26T16:15:48+05:30 IST