తలనొప్పి తొలగించుకునే మార్గాలు..

ABN , First Publish Date - 2022-04-28T21:35:46+05:30 IST

తలనొప్పికి ఒత్తిడి కారణమైతే దాన్ని తొలగించుకునే మార్గాలను అన్వేషించడంతో పాటు, ఒత్తిడి లేని జీవితాన్ని గడిపే మెలకువలను అలవరుచుకోవాలి.

తలనొప్పి తొలగించుకునే మార్గాలు..

ఆంధ్రజ్యోతి(28-04-2022)

తలనొప్పికి ఒత్తిడి కారణమైతే దాన్ని తొలగించుకునే మార్గాలను అన్వేషించడంతో పాటు, ఒత్తిడి లేని జీవితాన్ని గడిపే మెలకువలను అలవరుచుకోవాలి. 

రోజుకు మూడు సార్లు నియమిత వేళల్లో భోజనం తినాలి.

తాజాగా వండిన, వేడిగా ఉన్న, తేమతో కూడిన సూప్‌లు తాగాలి. చల్లగా, పొడిగా, పెళుసుగా ఉండే పదార్థాలు తినకూడదు. తీపి, ఉప్పుతో కూడిన పదార్థాలు తింటూ, కారంగా ఉండే వాటికి దూరంగా ఉండాలి.

కాఫీ, టీలు మానేసి, వీలైనన్ని ఎక్కువ నీళ్లు తాగుతూ ఉండాలి.

గోరువెచ్చని నూనెతో శరీర మర్దన ఉపయోగపడుతుంది. స్నానానికి ముందు ఈ అభ్యంగన ఆచరించాలి. ఇలాంటి స్నానంతో రక్తప్రసరణ మెరుగై, నాడీ వ్యవస్థ నెమ్మదించి పెరిగిన తలభారం తగ్గుతుంది. గంధం పొడి, రోజా పువ్వుల నుంచి తీసిన నూనెలను కలిపి, కణతల దగ్గర మర్దన చేసుకున్నా ఫలితం ఉంటుంది. 

యోగాభ్యాసంతో శరీర కణజాలానికి పోషణ అంది, నాడీ వ్యవస్థ, అంతఃస్రావ వ్యవస్థ, లింఫ్‌ వ్యవస్థలు చైతన్యమవుతాయి. కండర కణజాలం స్వాంతన పొంది, నొప్పి తగ్గుతుంది. ఇందుకోసం ముందుకు వంగే వీలున్న ఆసనాలు వేయాలి. అలాగే శరీరం వంపు తిప్పే వీలున్న ఆసనాలతో శరీరం సమతులం పొందుతుంది. ఫలితంగా తలనొప్పి తగ్గుతుంది.

పిప్పర్‌మింట్‌, లావెండర్‌ ఎసెన్షియల్‌ నూనెలు కూడా ఉపయోగపడతాయి.

గోరువెచ్చని నూనెతో శరీర మర్దన ఉపయోగపడుతుంది. స్నానానికి ముందు ఈ అభ్యంగన ఆచరించాలి. ఇలాంటి స్నానంతో రక్తప్రసరణ మెరుగై, నాడీ వ్యవస్థ నెమ్మదించి పెరిగిన తలభారం తగ్గుతుంది. గంధం పొడి, రోజా పువ్వుల నుంచి తీసిన నూనెలను కలిపి, కణతల దగ్గర మర్దన చేసుకున్నా ఫలితం ఉంటుంది.

Updated Date - 2022-04-28T21:35:46+05:30 IST