బ్యాటరీ లైఫ్‌ పెంచే టిప్స్‌

ABN , First Publish Date - 2021-07-03T05:34:15+05:30 IST

ఆండ్రాయిడ్‌ స్మార్ట్‌ ఫోన్‌ బ్యాటరీ జీవితకాలాన్ని కొద్దిపాటి చిట్కాలతో పెంచుకోవచ్చు. నిజానికి స్మార్ట్‌ఫోన్‌ టెక్నాలజీ

బ్యాటరీ లైఫ్‌ పెంచే టిప్స్‌

ఆండ్రాయిడ్‌ స్మార్ట్‌ ఫోన్‌ బ్యాటరీ జీవితకాలాన్ని కొద్దిపాటి చిట్కాలతో పెంచుకోవచ్చు. నిజానికి స్మార్ట్‌ఫోన్‌ టెక్నాలజీ చాలా మెరుగైంది. ప్రాసెసర్ల సమర్ధత మొదలుకుని హై రిజల్యూషన్‌ వరకు అన్నింటా అభివృద్ధి కనిపిస్తోంది. బ్యాటరీ జీవితకాలం పెంపు విషయంలో  మాత్రం ఎలాంటి మార్పూ లేదు. వేగంగా చార్జింగ్‌ సౌకర్యం మాత్రం అందుబాటులోకి వచ్చింది. అలాగే కొన్ని స్మార్ట్‌ఫోన్లలోని సమర్థ ప్రాసెసర్లతో బ్యాటరీ లైఫ్‌ ఒక మేర మెరుగైంది. ఉదాహరణకు శాంసంగ్‌ గెలాక్సీ ఎం51కి 7000ఎంఏహెచ్‌ బ్యాటరీని ప్రస్తావించుకోవచ్చు. ఈ నేపథ్యంలో బ్యాటరీ జీవితకాలాన్ని పెంచుకోవడం ఎలా అన్నది చూద్దాం. 


 స్ర్కీన్‌ బ్రైట్‌నెస్‌పై అదుపు

ఆండ్రాయిడ్‌ ఫోన్ల బ్యాటరీ జీవితకాలం తగ్గిపోవడానికి ప్రధాన కారణం స్ర్కీన్‌. ఆటోమేటిక్‌గా మారేలా సెట్‌ చేసుకోవచ్చు. ఆండ్రో పై(9.0)లో ఆటో బ్రైట్‌నెస్‌ మోడ్‌ ఉంది. ఇది వినియోగాన్ని బట్టి మార్చుకుంటుంది. ఎప్పుడైనా సరే, బ్రైట్‌నెస్‌ను కొద్దిగా తగ్గించి ఉంచుకుంటేనే మంచిది. 

బ్యాటరీ ఆప్టిమైజేషన్‌

ఆండ్రాయిడ్‌ మార్స్‌మల్లో(6.0)లో ఆపరేటింగ్‌ సిస్టమ్‌లోనే బ్యాటరీ జీవితంపై అదుపు ఉంది. ఇది బ్యాటరీ చార్జింగ్‌లను తగ్గించే ప్రక్రియల నుంచి యాప్‌లను నిరోధిస్తుంది. పదేపదే అప్‌డేట్‌లతో పనితీరు బాగా మెరుగైంది. బ్యాటరీ జీవితాన్ని పెంచుకోవాలంటే సెట్టింగ్స్‌ను చెక్‌ చేసుకోవాలి. అడాప్టివ్‌ బ్యాటరీ లేదా బ్యాటరీ ఆప్టిమైజేషన్‌ టర్న్‌డ్‌ ఆన్‌లో ఉందా లేదా అని తెలుసుకోవాలి. 




స్ర్కీన్‌ టైమ్‌ఔట్‌ను తగ్గించాలి

చాలామట్టుకు స్మార్ట్‌ ఫోన్లను ఒకటి లేదా రెండు నిమిషాలకు ‘టర్న్‌ ద స్ర్కీన్‌ ఆఫ్‌’లో ఉంచుకుంటారు. అదే 30 సెకండ్లకు తగ్గించుకుంటే బ్యాటరీ లైఫ్‌ ఇంకా పెరుగుతుంది. యాప్‌లను నియంత్రించుకుంటే, వాటి నేపథ్యంలో రన్‌ అయ్యే బ్యాటరీ వినియోగం తగ్గుతుంది. తద్వారా బ్యాటరీకి ప్రయోజనం చేకూరుతుంది. 

ఉపయోగించని అకౌంట్ల డిలీట్‌

ఆండ్రాయిడ్‌ స్మార్ట్‌ ఫోన్లలో పలు అకౌంట్లకు సైన్‌ చేసిన పక్షంలో బ్యాటరీ లైఫ్‌ తగ్గుతుంది. ప్రతి అకౌంట్‌ సింక్‌ అయ్యేందుకు ఉపయోగించే ఇంటర్నెట్‌, కాంటాక్ట్‌లు తదితరాలు లెక్కలోకి వస్తాయి. అందుకని అనవసరమైన అకౌంట్లను తొలగించుకోవడమే మంచిది. లేదంటే కనీసం ఆటోమేటిక్‌ సింక్‌ నుంచైనా తప్పించాలి. 

బ్యాటరీ సేవర్‌ యాప్‌లను ఉపయోగించవద్దు

‘స్నేక్‌ ఆయిల్‌ సొల్యూషన్‌’ అంటూ ప్లే స్టోర్లలో బోగస్‌ యాప్‌లను ఉంచుతారు. వాటితో బ్యాటరీ సేవింగ్‌ అంటూ ఏమీ జరగదు. ఇవన్నీ టాస్క్‌ కిల్లర్‌ లేదా రామ్‌ క్లీనర్‌ యాప్స్‌. బ్యాక్‌గ్రౌండ్‌ యాప్స్‌ను అవి చంపేస్తాయి. అంటే ఇవన్నీ ఉన్నట్టుండి యాక్లీవ్‌అవుతుంటాయి. ఫలితంగా ఆ ప్రక్రియ జరిగినప్పుడల్లా బ్యాటరీ జీవితకాలం హరించుకుంటూ వస్తుంది.

Updated Date - 2021-07-03T05:34:15+05:30 IST