కళ్ల కింద నలుపా?

ABN , First Publish Date - 2020-03-13T06:56:15+05:30 IST

కళ్ల కింద నల్లమచ్చలు, గీతలు, ముడతలు ఏర్పడితే వయసు పెరిగినట్టు కనిపిస్తారు. కళ్ల దగ్గరి చర్మం యవ్వనంగా కనిపించేందుకు...

కళ్ల కింద నలుపా?

కళ్ల కింద నల్లమచ్చలు, గీతలు, ముడతలు ఏర్పడితే వయసు పెరిగినట్టు కనిపిస్తారు. కళ్ల దగ్గరి చర్మం యవ్వనంగా కనిపించేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు...

తరచుగా కళ్లను రుద్దుకోవడం మానేయాలి. ఎందుకంటే రుద్దడం వల్ల కళ్ల కింద వలయాలు, గీతలు ఏర్పడే అవకాశం ఉంది. అలానే మేకప్‌ తొలగించేటప్పుడు, కళ్లను శుభ్రం చేసుకునేటప్పుడు జాగ్రత్త వహించాలి.

ఆహారంలో ఉప్పు తగ్గించాలి. ఆకుకూరలు, అరటిపండు, క్యాబేజీ, బ్రకోలి వంటివి ఎక్కువగా తినాలి. ఇవి కళ్ల కింద వలయాలను నివారిస్తాయి. వీటిలోని యాంటీ ఆక్సిడెంట్లు ఇన్‌ఫ్లమేషన్‌ను తగ్గించి, కళ్లు వాయడాన్ని అడ్డుకుంటాయి. ఠి కళ్లు వాపు ఎక్కకుండా ఉండాలంటే కెఫీన్‌, చక్కెర, వేగించిన ఆహార పదార్థాలను తగ్గించాలి.

Updated Date - 2020-03-13T06:56:15+05:30 IST