చిక్కులు లేని జుట్టు కోసం...

ABN , First Publish Date - 2020-05-24T05:15:10+05:30 IST

ఉదయాన్నే చిక్కులుపడిన జుట్టును దువ్వుకోవడం కొంత చిరాకుగానే అనిపిస్తుంది. అయితే అరటిపండు ఉంటే అ సమస్య తీరుతుందంటున్నారు నటి సమీరా రెడ్డి...

చిక్కులు లేని జుట్టు కోసం...

ఉదయాన్నే చిక్కులుపడిన జుట్టును దువ్వుకోవడం కొంత చిరాకుగానే అనిపిస్తుంది. అయితే అరటిపండు ఉంటే అ సమస్య తీరుతుందంటున్నారు నటి సమీరా రెడ్డి. 


కావలసినవి: బాగా మగ్గిన అరటిపండు - ఒకటి, తేనె - టేబుల్‌ స్పూన్‌, కొబ్బరి నూనె - టేబుల్‌ స్పూన్‌, పెరుగు - టేబుల్‌ స్పూన్‌.


తయారీ: అరటిపండును మెత్తగా మిక్సీ పట్టాలి. తరువాత తేనె, కొబ్బరినూనె, పెరుగు వేసి చిక్కని పేస్ట్‌లా చేయాలి దాన్ని జుట్టుకు పట్టించి అరగంట తరువాత షాంపూతో శుభ్రం చేసుకోవాలి. కురులను కండిషనర్‌ సాయంతో దువ్వుకోవాలి. జుట్టు కొద్దిగా ఆరాక మళ్లీ దువ్వాలి. ఇలాచేస్తే ఆరోగ్యమైన, చిక్కుల్లేని జుట్టు మీ సొంతం!


Updated Date - 2020-05-24T05:15:10+05:30 IST