పెదవులు మెరుస్తాయిలా!

ABN , First Publish Date - 2021-02-22T20:54:46+05:30 IST

తాజాగా, ఆరోగ్యంగా ఉండే పెదవులు తెచ్చే అందం చాలానే. అయితే ఎండ ఎక్కువగా తగలడం, తేమ తగ్గడం, టూత్‌పేస్ట్‌ వల్ల జరిగే ఎలర్జీ చర్య వల్ల ఒక్కోసారి పెదవులు నల్లగా మారతాయి. అలాంటప్పుడు వాటిని తాజాగా, కాంతిమంతంగా మలచుకునేందుకు ఏం చేయాలంటే...

పెదవులు మెరుస్తాయిలా!

ఆంధ్రజ్యోతి(22-02-2021)

తాజాగా, ఆరోగ్యంగా ఉండే పెదవులు తెచ్చే అందం చాలానే. అయితే ఎండ ఎక్కువగా తగలడం, తేమ తగ్గడం, టూత్‌పేస్ట్‌ వల్ల జరిగే ఎలర్జీ చర్య వల్ల ఒక్కోసారి పెదవులు నల్లగా మారతాయి. అలాంటప్పుడు వాటిని తాజాగా, కాంతిమంతంగా మలచుకునేందుకు ఏం చేయాలంటే...


నిమ్మరసం: తాజా నిమ్మరసాన్ని రాత్రిపూట నిద్రపోయే ముందు పెదవులపై రాసుకోవాలి. ఉదయాన్నే చల్లని నీళ్లతో శుభ్రం చేసుకోవాలి. ఫలితం కనిపించేత వరకు ఇలా చేస్తూ ఉండాలి.


పసుపు: టేబుల్‌ స్పూన్‌ పాలలో కొద్దిగా పసుపు వేయాలి. ఈ మిశ్రమాన్ని తడి చేతితో పెదవులకు రాయాలి. అయిదు నిమిషాల తరువాత చల్లని నీళ్లతో కడిగేస్తే పెదవుల నలపుదనం తగ్గుతుంది.


అలొవెరా: ప్రతిరోజు కొద్దిగా అలొవెరా జెల్‌ను పెదవులకు రద్దుకోవాలి. ఆరిన తరువాత వేడినీళ్లతో కడుక్కోవాలి. అలొవెరా లోని గుణాలు పెదవులను తాజాగా మారుస్తాయి.


కొబ్బరినూనె: చేతివేలి కొసను కొబ్బరి నూనెలో ముంచి, పెదవులపై కొబ్బరి నూనె అంతటా అంటేలా రాసుకోవాలి. రోజులో నాలుగైదు సార్లు ఇలా చేయవచ్చు. రాత్రిపూట కూడా రాసుకోవచ్చు. 


రోజ్‌వాటర్‌: రెండు చుక్కల రోజ్‌వాటర్‌కు ఆరు చుక్కల తేనె కలపాలి. ఈ మిశ్రమాన్ని రోజులో మూడు సార్లు పెదవులకు అప్లై చేయాలి. దాంతో పెదవులు క్రమంగా ఎరుపు రంగులోకి మారతాయి.


కీరదోస రసం: సగం కీరదోసను మిక్సీ పట్టి రసం తీసి, ఫ్రిజ్‌లో పెట్టాలి. ఇప్పడు కాటన్‌బాల్‌ను కీరదోస జ్యూస్‌లో ముంచి దాంతో పెదవులపై రుద్దుకోవాలి. అరగంట తరువాత చన్నీళ్లతో శుభ్రం చేసుకుంటే ఫలితం కనిపిస్తుంది.



Updated Date - 2021-02-22T20:54:46+05:30 IST