చుండ్రు వదలాలంటే ఈ చిట్కాలు ఫాలో అయిపోండి..!

ABN , First Publish Date - 2022-04-13T21:23:09+05:30 IST

కొందరిని చుండ్రు సమస్య చాలా వేధిస్తుంది. వాళ్లు రకరకాల షాంపూలు ప్రయత్నించి విఫలమవు తుంటారు. అయితే ఈ సమస్యను సింపుల్‌ హోమ్‌ రెమిడీస్‌తో

చుండ్రు వదలాలంటే ఈ చిట్కాలు ఫాలో అయిపోండి..!

ఆంధ్రజ్యోతి(13-04-2022)

కొందరిని చుండ్రు సమస్య చాలా వేధిస్తుంది. వాళ్లు రకరకాల షాంపూలు ప్రయత్నించి విఫలమవు తుంటారు. అయితే ఈ సమస్యను సింపుల్‌ హోమ్‌ రెమిడీస్‌తో దూరం చేసుకోవచ్చు. చుండ్రు వదలాలంటే ఈ చిట్కాలు ఫాలో అయిపోండి.


ఆలివ్‌ ఆయిలో సహజసిద్ధంగా చుండ్రును తొలగించే గుణాలున్నాయి. వారంలో రెండు రోజులు తలకు ఆలివ్‌ ఆయిల్‌తో మసాజ్‌ చేస్తే మంచి ఫలితం ఉంటుంది. రాత్రి పడుకునే ముందు ఆలివ్‌ ఆయిల్‌ పట్టించి తలచుట్టూ టవల్‌ లేక షవర్‌క్యాప్‌ పెట్టుకుని పడుకోవాలి. ఉదయాన్నే ఏదైనా షాంపూతో తలస్నానం చేస్తే సరి.


నిమ్మ ఆకులు అందరికీ అందుబాటులో ఉంటాయి. కొన్ని నిమ్మ ఆకులను తీసుకుని అరగంట పాటు నీళ్లలో మరిగించాలి. తరువాత ఆ ఆకులను పేస్ట్‌ మాదిరిగా చేసుకుని తలకు పట్టించాలి. నలభైనిమిషాల పాటు అలా వదిలేసి తరువాత నీళ్లతో శుభ్రంగా కడిగేసుకోవాలి. 


ప్రతి ఇంట్లోనూ కలబంద మొక్క ఉంటుంది. ఈ మొక్కలో యాంటీబ్యాక్టీరియల్‌, యాంటీ ఫంగల్‌ గుణాలుంటాయి. ఇవి చుండ్రును సమర్ధవంతంగా తొలగిస్తాయి. తలకు అలోవెరా జెల్‌ను పట్టించి నలభై నిమిషాలు వదిలేయాలి. తరువాత నీళ్లతో శుభ్రం చేసుకోవాలి. వారానికి ఒకసారి ఇలాచేస్తే చుండ్రు సమస్య దూరమవుతుంది.


గుప్పెడు మెంతులను రాత్రంతా నీళ్లలో నానబెట్టి ఉదయాన్నే పేస్ట్‌ మాదిరిగా చేసుకుని తలకు పట్టించాలి. అరగంటపాటు అలా వదిలేసి తరువాత గోరువెచ్చని నీటితో తలస్నానం చేయాలి. వారానికి ఒకసారి నెల పాటు చేస్తే చుండ్రు సమస్య శాశ్వతంగా పోతుంది. 

Updated Date - 2022-04-13T21:23:09+05:30 IST