జుట్టు దెబ్బతినకుండా ఉండాలంటే ఈ పొరపాట్లు చెయ్యొద్దు!

ABN , First Publish Date - 2022-05-04T17:44:34+05:30 IST

జుట్టు ఒత్తుగా, మెరిసేలా ఉండడానికి ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటాం. కానీ మనం తరచుగా చేసే కొన్ని పొరపాట్ల వల్ల జుట్టు తీవ్రంగా దెబ్బతింటుంది. అలాకాకుండా ఉండాలంటే ఈ చిట్కాలు పాటించండి.

జుట్టు దెబ్బతినకుండా ఉండాలంటే ఈ పొరపాట్లు చెయ్యొద్దు!

ఆంధ్రజ్యోతి(04-05-2022)

జుట్టు ఒత్తుగా, మెరిసేలా ఉండడానికి ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటాం. కానీ మనం తరచుగా చేసే కొన్ని పొరపాట్ల వల్ల జుట్టు తీవ్రంగా దెబ్బతింటుంది. అలాకాకుండా ఉండాలంటే ఈ చిట్కాలు పాటించండి.

స్నానానికి ముందు జుట్టు చిక్కులు పడినట్టు అనిపిస్తే, కాస్త నూనె రాసి, పళ్ళు వెడల్పుగా ఉన్న దువ్వెనతో చిక్కులు తొలగించుకోండి. అలాగే జుట్టు పూర్తిగా ఆరేవరకూ ఆగి, అప్పుడు దువ్వుకుంటే, జుట్టు పొడిబారిపోయి, మెరుపును కోల్పోతుంది. కాబట్టి మరీ తడిగా ఉన్నప్పుడూ, లేదా బాగా ఆరిపోయినప్పుడూ కాకుండా కాస్త తడిగా ఉన్నప్పుడే తల దువ్వుకుంటే మంచిది. తడిగా ఉన్నప్పుడు జుట్టు కుదుళ్ళు బలహీనంగా ఉంటాయి. తడి జుట్టును టవల్‌తో అదే పనిగా రుద్దడం వల్ల అవి ఇంకా బలహీనమవుతాయి. 

అందుకని... తడిని టవల్‌ పీల్చుకొనేలా మెల్లగా తలమీద ఒత్తండి. డ్రయ్యర్‌ ఉపయోగించడం వల్ల... జుట్టు తడి వేగంగా ఆరిపోతుంది. కానీ, దీనివల్ల జుట్టు దెబ్బతింటుంది. కాబట్టి జుట్టులో నీరు పూర్తిగా పోయే వరకూ ఆగండి. డ్రయ్యర్‌ను ఫుల్‌ హీట్‌లో కాకుండా మీడియంలో పెట్టండి. ఎక్కువ వేడి వల్ల జుట్టు కుదుళ్ళు, చివర్లు పాడవుతాయి. స్నానం చేశాక జుట్టు బాగా తడిగా ఉన్నప్పుడు... తుడుచుకోకముందే టవల్‌ చుట్టబెట్టడం, లేదా ముడి వెయ్యడం చెయ్యొద్దు.

Read more