ఎసిడిటీ సమస్య వేధిస్తుందా? అయితే ఈ చిట్కాలు పాటించండి..!

ABN , First Publish Date - 2022-02-17T18:43:41+05:30 IST

ఎసిడిటీ కొందరిని చాలా ఇబ్బంది పెడుతుంది. అయితే ఈ సమస్యను అధిగమించేందుకు కొన్ని చిట్కాలు పాటిస్తే సరి. అవేమిటంటే...

ఎసిడిటీ సమస్య వేధిస్తుందా? అయితే ఈ చిట్కాలు పాటించండి..!

ఆంధ్రజ్యోతి(17-02-2022)

ఎసిడిటీ కొందరిని చాలా ఇబ్బంది పెడుతుంది. అయితే ఈ సమస్యను అధిగమించేందుకు కొన్ని చిట్కాలు పాటిస్తే సరి. అవేమిటంటే...


ఎసిడిటీ తీవ్రంగా ఉంటే ఒక గ్లాసు చల్లటి పాలు తాగండి. సత్వరం ఉపశమనం లభిస్తుంది.   

అజీర్తి వల్ల కలిగే ఎలాంటి అసౌకర్యానికైనా వాము చక్కగా పనిచేస్తుంది. యాసిడ్‌ రిఫ్లక్స్‌ సమస్యకు వాము న్యాచురల్‌ రెమెడీగా పనికొస్తుంది. వాములో ఉండే థైమోల్‌ అనే రసాయనం జీర్ణసమస్యల నుంచి ఉపశమనానికి సహాయపడుతుంది.  

నాలుగైదు తులసి ఆకులను నోట్లో వేసుకుని నములుతున్నా ఉపశమనం లభిస్తుంది. పొట్టలో యాసిడ్‌ తయారీని తులసి ఆకులు తగ్గిస్తాయి.  

కొబ్బరి నీళ్లు కూడా మంచి పరిష్కారాన్ని అందిస్తాయి. కొబ్బరినీళ్లలో ఉండే పొటాషియం వంటి ఎలకో్ట్రలైట్‌ గుణాలు యాసిడ్‌ రిఫ్లక్స్‌ను తగ్గించడంలో సహాయపడతాయి.  

అల్లంలో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలుంటాయి. ఇది అజీర్తి, ఛాతీలో మంట వంటి సమస్యల నుంచి ఉపశమనాన్ని అందిస్తుంది.   

మజ్జిగ తీసుకోవడం వల్ల కూడా ఎసిడిటీ సమస్య నుంచి ఉపశమనం లభిస్తుంది. మజ్జిగలో ఉంటే లాక్టిక్‌ యాసిడ్‌, పొట్టలోని యాసిడ్‌ను నార్మలైజ్‌ చేస్తుంది. కొద్దిగా మిరియాల పొడి, కొత్తిమీర వేసుకుని తాగితే మంచి ఫలితం ఉంటుంది.  

ఎసిడిటీని తగ్గించడానికి యాపిల్‌ సెడార్‌ వెనిగర్‌ పనికొస్తుంది. ఒక టేబుల్‌స్పూన్‌ యాపిల్‌ సెడార్‌ వెనిగర్‌ను గ్లాసు నీళ్లలో కలిపి తీసుకుంటే మంచి ఫలితం కనిపిస్తుంది.

Updated Date - 2022-02-17T18:43:41+05:30 IST