బైలింగ్వల్‌ పద్ధతిలో పాఠ్యాంశాల బోధన

ABN , First Publish Date - 2022-05-22T06:48:25+05:30 IST

పాఠాలు రెండు మాధ్యమాల్లో బోధించారు. పరీక్షలు మాత్రం తాము చెప్పి న మాధ్యమంలోనే రాయాలంటూ హుకుం జారీ చేశారు.

బైలింగ్వల్‌ పద్ధతిలో పాఠ్యాంశాల బోధన
ఇంగ్లీష్‌ మీడియంలో రాయాలన్న ఉత్తర్వులివే..

టింగ్లిష్‌ తంటాలు

పరీక్షల్లో తెలుగు మీడియం ఆప్షన ఎత్తివేత

డిగ్రీ విద్యార్థులకు గుదిబండలా ఇంగ్లిష్‌ మీడియం

ఫలితాలపై విద్యార్థుల ఆందోళన 

అనంతపురం సెంట్రల్‌ : పాఠాలు రెండు మాధ్యమాల్లో బోధించారు. పరీక్షలు మాత్రం తాము చెప్పి న మాధ్యమంలోనే రాయాలంటూ హుకుం జారీ చేశారు. దీంతో ఇంటర్‌లో తెలుగు మీడియం చదివి డిగ్రీలో చేరిన విద్యార్థులు ఇంగ్లి్‌షలో పరీక్షలు రాయడానికి తీవ్ర ఇబ్బందు లు పడుతున్నారు. ఇదీ ఎస్కేయూ పరిధిలోని డిగ్రీ కళాశాలల విద్యార్థుల పరిస్థితి. ఎస్కేయూ ఆధ్వర్యంలో ఈనెల 11 నుంచి 21వ తేదీ వరకు నిర్వహించిన డిగ్రీ మొదటి సెమిస్టర్‌ పరీక్షలను యాజమాన్యం ఒత్తిడితో విద్యార్థులు ఇంగ్లిష్‌ మీడియంలో వచ్చీరాని ఇంగ్లి్‌షలో రాశారు. అయితే ఫలితాలు ఎలాగుంటాయోనని  ఆందోళన చెందుతున్నారు. డిగ్రీలోని హిస్టరీ, ఎకనామిక్స్‌, పొలిటికల్‌ సైన్స వంటి సబ్జెక్టులలో పెద్దపెద్ద థియరీలను ఇంగ్లిష్‌లో రాయమంటే తమలాంటి తెలుగు మీడియం నుంచి వచ్చిన వారికి ఎలా సాధ్యమవుతుందని పలువురు విద్యార్థులు  మండిపడుతున్నారు. కంప్యూటర్‌ అప్లికేషన్స, కంప్యూటర్‌ సైన్స, బయో టెక్నాలజీ వంటి రీస్ట్రక్చర్‌ కోర్సులు ఇంగ్లిష్‌ మీడియంలో ఉన్నా పరీక్షలు రాసేందుకు మీడియం ఆప్షన ఉందని చెప్పారు. దీంతో డిగ్రీలో చేరామని, అయితే పరీక్షలకు ముందు మీడియం ఆప్షన ఇవ్వకుండానే ఏకపక్ష ధోరణితో వర్సిటీ యాజమాన్యం ఇంగ్లిష్‌ మీడియంలోనే పరీక్షలు రాయమనడం దారుణమని వాపోతున్నారు.  మరోవైపు తాము ఎదుర్కొంటున్న సమస్యలను ప్రచారం చేయవద్దం టూ వర్సిటీ యాజమాన్యం కళాశాలలపై ఒత్తిడి తెచ్చి మౌఖికంగా హుకుం జారీచేయడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. బహిరంగంగా విద్యార్థులు వారి సమస్యలను చెబితే వర్సిటీ పరువు ప్రతిష్టలు పోతాయంటున్న యాజమాన్యం సమస్యలకు తావులేకుండా చర్యలు తీసుకోవడంపై ఎందుకు దృష్టిసారించడంలేదని ప్రశ్నిస్తున్నారు. విద్యార్థుల  డిగ్రీ పరీక్షా ఫలితాల్లో ఫెయిల్‌శాతం ఎక్కువగా నమోదవుతుండటంతో వచ్చే ఏడాది ప్రవేశాలు తగ్గిపోయే ప్రమాదం ఎక్కువగా ఉందని కళాశాలల యాజమాన్యాలు ఆక్రోశిస్తున్నాయి. 2021-22 ప్రవేశాల్లో తెలుగు మాధ్యమా న్ని తొలగించి కేవలం ఇంగ్లిష్‌ మీడియంను పెట్టడంతో ప్రవేశాలు పొందిన చాలామంది విద్యార్థులు వెనక్కి వెళ్లిపోయారని గుర్తు చేసుకుంటున్నాయి. కేంద్రప్రభుత్వం మాతృభాషను ప్రోత్సహించే విధంగా స్థానిక భాషల్లోనే పరీక్షలు నిర్వహిస్తుంటే రాష్ట్ర ప్రభుత్వం మాత్రం తెలు గును విస్మరించి ఇంగ్లి్‌షను ముద్దాడుతోందని విద్యార్థుల తల్లిదండ్రులు మండిపడుతున్నారు. ఉన్నఫలంగా ఇంగ్లిష్‌ మీడియంలోనే పరీక్షలు రాయాలంటూ హుకుం జారీచేస్తూ తమపిల్లల భవిష్యత్తుతో ఆటలాడుకోవడం ఏంటని వారు ప్రశ్నిస్తున్నారు.


ఇంగ్లిష్‌లో కదలని పెన్ను...

ఇంగ్లిష్‌ మీడియంలో పరీక్షలు రాయాలంటే పెన్ను కదలడంలేదని విద్యార్థులు వాపోతున్నారు. గ్రామీణ పాంత్రాల్లోని విద్యాసంస్థల్లో తెలుగు మీడియంలో ఇంటర్‌వరకు చదివి డిగ్రీల్లో ఇంగ్లిష్‌ మీడియంలో నేర్చు కోవాలంటే కష్టంగా ఉందని పేర్కొంటున్నారు. పాఠాలను ఇంగ్లిష్‌, తెలుగు(బైలింగ్విల్‌) పద్ధతిలో బోధించడంతో పరీక్షలు తెలుగు మీడియంలో రాయడానికి అవకాశాన్ని కల్పిస్తారని ఆశపడ్డామని, అయితే ఉన్నఫళంగా ఇంగ్లిష్‌ మీడియంలో జవాబులు రాయలంటూ పరీక్షల ముందు ఆదేశించడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. ముఖ్యంగా ఇంటర్‌లో హెచఈసీ, సీఈసీ వంటి ఆర్ట్స్‌ గ్రూప్‌లు చదివిన విద్యా ర్థులు డిగ్రీ సెమిస్టర్‌ పరీక్షల్లో సంపూర్ణంగా జవాబులు రాయలేకపోతున్నామని వాపోతున్నారు.  


ముగిసిన పరీక్షలు...

 ఉమ్మడి జిల్లాలో దాదాపు 28వేల మంది విద్యార్థులు పరీక్షలు రాశారు. వీరిలో అత్యధికంగా ఇంటర్‌లో తెలుగు మీడియం నుంచి వచ్చిన విద్యార్థులే. ఫస్ట్‌సెమిస్టర్‌లో ఫెయిల్‌ అయితే సప్లిమెంటరీ ఫీజులతోపాటు తిరిగి పాఠాలను మొదటి నుంచి చదువుకోవాలి. వీటితోపాటు సెకెండ్‌ సెమిస్టర్‌ పరీక్షలు రాయాల్సి ఉంటుంది.  





ఇంగ్లిష్‌లో రాయలేకపోతున్నాం...

ఇంటర్‌వరకు తెలుగు మీడియంలో పరీక్షలు రాసి డిగ్రీలో ఇంగ్లిష్‌ మీడియంలో జవాబులు రాయలేకపోతున్నాం. ఆర్ట్స్‌ కోర్సుల విద్యార్థులందరూ ఇదే సమస్యను ఎదుర్కొంటున్నారు. పాఠాలను బైలింగ్విల్‌ విధానంలో బోధించారు. పరీక్షల్లోకూడా తెలుగు, ఇంగ్లిష్‌ ఆప్షన్లు ఇస్తారని అనుకున్నాము. అయితే పరీక్షల సమయంలో  ఇంగ్లిష్‌లోనే రాయలంటూ ఆదేశించారు. పాఠాలు బోధించిన సమయంలోనే పరీక్షలు ఇంగ్లిష్‌ మీడియంలో రాయాల్సి ఉంటుందని  చెప్పి ఉంటే అప్రమత్తమయ్యేవాళ్లం. గ్రామీణ ప్రాంతాలనుంచి వచ్చిన వేలాదిమంది విద్యార్థులకు ఇంగ్లిష్‌ మీడియం శాపంగా మారింది. 

-కేశవ, డిగ్రీ ఈసీఈ  విద్యార్థి



విద్యార్థులకే ఆప్షన ఇవ్వాలి

మీడియం ఆప్షన విద్యార్థులకే ఇవ్వాలి. ఎలాంటి సమాచారం లేకుండా ఉన్నఫళంగా ఇంగ్లి్‌షలో పరీక్షలు రాయమనడంతో పాస్‌ కావడం కష్టంగా ఉంటుందని చాలామంది వాపోతున్నారు. 1వ తరగతి నుంచి ఇంటర్‌ వరకు తెలుగులో చదువుకున్నవాళ్లమే.  కార్పొరేట్‌ స్కూళ్లలో చదివిన వారికి ఇంగ్లి్‌షలో రాయడం సులువుగా ఉంటుంది. అత్యధికంగా ప్రభుత్వ పాఠశాలలనుంచి వచ్చినవాళ్లమే. మాలాంటివారికి ఇంగ్లిష్‌ మీడియంలో డిగ్రీ పూర్తి చేయ డం ఎన్నిసంవత్సరాలు పడుతుందో తెలియదు.

- మంజునాథ్‌, డిగ్రీ బీబీఏ విద్యార్థి

Updated Date - 2022-05-22T06:48:25+05:30 IST