Jul 8 2021 @ 18:41PM

‘తిమ్మరుసు’ విడుదల తేదీ ఖరారు

సత్యదేవ్‌ హీరోగా నటించిన ‘తిమ్మరుసు’ చిత్రం విడుదల ఖరారైంది. ఈ నెల 30న సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నట్లు గురువారం జరిగిన విలేకర్ల సమావేశంలో నిర్మాతలు మహేశ్‌ కోనేరు, సృజన్‌ ఎరబోలు తెలిపారు.  శరణ్‌ కొప్పిశెట్టి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో ప్రియాంక జవాల్కర్‌ కథానాయిక. సత్యదేవ్‌ మాట్లాడుతూ ‘‘ఉమామహేశ్వరాయ ఉగ్రరూపస్య’ సినిమా చేసిన తర్వాత ఎలాంటి సినిమా చేయాలనుకుంటున్న తరుణంలో ‘తిమ్మరుసు’ కథ విన్నాను. దర్శకుడు ఎలా డైరెక్ట్‌ చేస్తాడో అని టెన్షన్‌ ఉండేది. షూటింగ్‌ పూర్తయ్యాక అతని టాలెంట్‌ ఏంటో తెలిసింది. సంగీతం సినిమాకు ఎసెట్‌ అవుతుంది ’’ అని అన్నారు. ‘‘సత్యదేవ్‌ లాయర్‌ పాత్రలో కనిపిస్తారు. ఆయన పాత్ర కొత్తగా ఉంటుంది. అప్పు విజువల్స్‌, శ్రీచరణ్‌ మ్యూజిక్‌ సినిమాకు ఎస్సెట్‌గా నిలిచాయి. జూలై 30న థియేటర్స్‌లో విడుదలయ్యే ఈ సినిమా కచ్చితంగా బెస్ట్‌ మూవీగా అందరి ప్రశంసలు అందుకుంటుంది’’ అన్నారు. దర్శకుడు శరణ్‌ కొప్పిశెట్టి మాట్లాడుతూ ‘‘శ్రీకృష్ణదేవరాయల ఆస్థ్థానంలోని తిమ్మరుసు తెలివైన వ్యక్తి. చక్కగా వ్యుహాన్ని చేయడమే కాదు.. మంచి నిజాయతీగల వ్యక్తి కూడా. అలాంటి క్యారెక్టర్‌ ఈ చిత్రంలో సత్యదేవ్‌తో చేయించాం’’ అని దర్శకుడు చెప్పారు.