బిట్‌కాయిన్‌కు ‘టైమ్’ అంగీకారం...

ABN , First Publish Date - 2021-04-22T01:17:25+05:30 IST

ప్రముఖ పబ్లిషింగ్ కంపెనీ ‘టైమ్’ మేగజైన్ ఇప్పుడు బిట్‌కాయిన్ సహా మరికొన్ని ఇతర క్రిప్టోకరెన్సీలను డిజిటల్ సబ్‌స్క్రిప్షన్ పేమెంట్‌గా అంగీకరిస్తోంది.

బిట్‌కాయిన్‌కు ‘టైమ్’ అంగీకారం...

న్యూయార్క్ : ప్రముఖ పబ్లిషింగ్ కంపెనీ ‘టైమ్’ మేగజైన్ ఇప్పుడు బిట్‌కాయిన్ సహా మరికొన్ని ఇతర క్రిప్టోకరెన్సీలను డిజిటల్ సబ్‌స్క్రిప్షన్ పేమెంట్‌గా అంగీకరిస్తోంది. ప్రముఖ డిజిటల్ కరెన్సీ ఎక్స్చేంజ్ క్రిప్టో డాట్ కామ్‌తో ఈ మేరకు ఒప్పందం చేసుకుంది. ఈ నేపధ్యంలో... టైమ్ మేగజైన్... తన 18 నెలల డిజిటల్ సబ్‌స్క్రిప్షన్ కోసం వన్ టైమ్ క్రిప్టో చెల్లింపులను అంగీకరిస్తోంది. ఇటీవల క్రిప్టోకరెన్సీలకు డిమాండ్ పెరుగుతోన్న విషయం తెలిసిందే. ఓ సమయంలో 64 వేల డాలర్లు క్రాస్ చేసిన క్రిప్టో కింగ్ బిట్ కాయిన్ విలువ...  ప్రస్తుతం 55 డాలర్లకు పైగానే ఉంది. 


క్యాష్‌బ్యాక్ ఆఫర్లు కూడా...

యూజర్లు క్రిప్టో డాట్ ఆర్గ్ కాయిన్‌తో కొనుగోలు చేస్తే 10 శాతం క్యాష్ బ్యాక్ ఆపర్ వర్తిస్తుంది. డిజిటల్ సబ్‌స్క్రిప్షన్ కాస్ట్ 49 డాలర్లుగా ఉంది. ప్రస్తుతం అమెరికా, కెనడాల్లో మాత్రమే క్రిప్టోకరెన్సీ సబ్‌స్క్రిప్షన్‌కు అందుబాటులో ఉన్న విషయం తెలిసిందే. రానున్న కొద్ది నెలల్లో అంతర్జాతీయంగా ఈ సబ్‌స్క్రిప్షన్ అందుబాటులోకి తీసుకువచ్చే ప్రయత్నాలు జరుగుతున్నాయి. 


కొత్తటెక్నాలజీ...

క్రిప్టో డాట్ కామ్‌తో కలిసి పని చేస్తున్నామని టైమ్ మేగజైన్ ప్రెసిడెంట్ కేత్ గ్రాసీమ్ వెల్లడించారు. ఇది మరింత విస్తరణకు ఉపయోగపడుతుందని పేర్కొన్నారు. టైమ్ మేగజైన్ ఎప్పటికప్పుడు కొత్త టెక్నాలజీని అందిపుచ్చుకుంటోందని చెప్పడానికి ఇదో నిదర్శనమని టైమ్స్ చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్ భరత్ క్రిష్ వ్యాఖ్యానించారు.


Updated Date - 2021-04-22T01:17:25+05:30 IST