సమయం కోరేది ఇప్పుడా?

ABN , First Publish Date - 2022-05-20T08:44:09+05:30 IST

పదో తరగతి ప్రశ్నపత్రం లీకేజీ వ్యవహారంలో ప్రభుత్వ అదనపు పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ తీరుపై హైకోర్టు తీవ్ర అసంతృప్తి వ్యక్తంచేసింది. ఈ అంశంలో ముందస్తు బెయిల్‌

సమయం కోరేది ఇప్పుడా?

ఉత్తర్వులివ్వడానికి సిద్ధంగా ఉంటే.. ఇప్పుడు వాదనలు వినిపిస్తామంటారా?

ఏపీపీ అభ్యర్థనపై హైకోర్టు తీవ్ర అసంతృప్తి

నారాయణ కుమార్తెల విషయంలో మధ్యంతర ఉత్తర్వులు పొడిగింపు


అమరావతి, మే 19 (ఆంధ్రజ్యోతి): పదో తరగతి ప్రశ్నపత్రం లీకేజీ వ్యవహారంలో ప్రభుత్వ అదనపు పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ తీరుపై హైకోర్టు తీవ్ర అసంతృప్తి వ్యక్తంచేసింది. ఈ అంశంలో ముందస్తు బెయిల్‌ మంజూరు చేయాలంటూ మాజీ మంత్రి పి.నారాయణ కుమార్తెలు, అల్లుడు, మరికొందరు దాఖలు చేసిన వ్యాజ్యాలపై వాదనలు ముగిసి.. నిర్ణయం వెల్లడికి వ్యాజ్యాలను పోస్ట్‌ చేసిన ఈ దశలో వాదనలు వినిపించేందుకు సమయం కోరడం ఏంటని ఏపీపీ దుష్యంత్‌ రెడ్డిపై అసహనం వ్యక్తం చేసింది. ఇరుపక్షాల వాదనలు ముగియడంతో న్యాయస్థానం ఒక నిర్ణయానికి వచ్చిందని.. తగిన ఉత్తర్వులు ఇచ్చేందుకు గురువారానికి వాయిదా వేశామని గుర్తుచేసింది.


ఈ దశలో వాదనలు వినిపించేందుకు సమయం కోరడం ఏమిటని నిలదీసింది. అయితే అంతిమంగా ఏఏజీ వాదనలు వినేందుకు విచారణను ఈ నెల 26కి వాయిదా వేసింది. పిటిషనర్ల విషయంలో తొందరపాటు చర్యలు తీసుకోవద్దని గతంలో ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను జస్టిస్‌ కె.మన్మథరావు పొడిగించారు. పిటిషనర్ల తరఫున సీనియర్‌ న్యాయవాది పోసాని వెంకటేశ్వర్లు, గింజుపల్లి సుబ్బారావు వాదనలు వినిపించారు. 

Updated Date - 2022-05-20T08:44:09+05:30 IST