పాఠ్యపుస్తకాల పంపిణీకి సమాయత్తం

ABN , First Publish Date - 2022-07-03T05:05:54+05:30 IST

జిల్లాలో ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు 2022-23 విద్యా సంవత్సరం పాఠ్యపుస్తకాల పంపిణీకి విద్యాశాఖ అధికారులు సమాయత్తం అవు తున్నారు.

పాఠ్యపుస్తకాల పంపిణీకి సమాయత్తం
గోదాంలో పాఠ్య పుస్తకాలను పరిశీలిస్తున్న జిల్లా విద్యాధికారి గోవిందరాజులు

- నాగర్‌కర్నూల్‌ జిల్లాకు అవసరమైన పుస్తకాలు 5,05,300  

- ఇప్పటికి వచ్చినవి 1,76,819 - పంపిణీకి మండలాలకు తరలింపు

నాగర్‌కర్నూల్‌ టౌన్‌, జూలై 2: జిల్లాలో ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు 2022-23 విద్యా సంవత్సరం పాఠ్యపుస్తకాల పంపిణీకి విద్యాశాఖ అధికారులు సమాయత్తం అవు తున్నారు. నాగర్‌కర్నూల్‌ జిల్లాలోని అన్ని ప్రభుత్వ యాజమాన్య పాఠశాలలకు మొ త్తం 5,05,300 అవసరంగా కాగా ఇప్పటికి 1,76,819 పాఠ్యపుస్తకాలు వచ్చాయి. ఈ వి ద్యా సంవత్సరం ప్రారంభం అయ్యి ఇప్పటికే 15 రోజులు పూర్తయినా విద్యార్థులకు పాఠ్య పుస్తకాలు అందలేదు. దీంతో ప్రభుత్వ బడు ల్లో పుస్తకాలు లేకుండానే భోధన కొనసాగిం చారు. సోమవారం నుంచి వచ్చిన పుస్తకాల ను విద్యార్థులకు పంపిణీ చేసేందుకు అధి కారులు ఏర్పాట్లు చేస్తున్నారు. శనివారం జిల్లా కేంద్రంలోని జడ్పీ బాలుర పాఠశాల లో నిల్వ ఉంచిన గోదాం నుంచి పాఠ్య పు స్తకాలను మండల వనరుల కేంద్రాలకు త రలింపును జిల్లా విద్యాధికారి గోవిందరాజు లు ప్రారంభించారు. ఈ సందర్భంగా డీఈ వో మాట్లాడుతూ జిల్లాకు ఇంకా 3,28,481 పాఠ్య పుస్తకాలు రావాల్సి ఉందని తెలిపా రు. ఈ ఏడాది నుంచి ప్రభుత్వ పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమం ప్రారంభిస్తున్న నేపథ్యం లో తెలుగు, ఇంగ్లిష్‌ రెండు మాధ్యమాలకు కలిపి ఒకే పుస్తకం ముద్రిస్తున్నందుకు కాస్త అలస్యం అయ్యిందని తెలిపారు. గణితం, సై న్స్‌, సోషల్‌ స్టడీస్‌ పుస్తకాలు రెండు మాద్య మాల్లో ఉంటాయని మిగతా భాషా పుస్తకా లు ఎప్పటిలాగే ఉంటాయని పేర్కొన్నారు. 

Updated Date - 2022-07-03T05:05:54+05:30 IST