స్టోరీల టైమ్‌ పెంపు

ABN , First Publish Date - 2022-10-01T06:03:01+05:30 IST

ఇంతకు ముందు ఈ పరిమితి పదిహేను సెకండ్లు మాత్రమే.

స్టోరీల టైమ్‌ పెంపు

ఇన్‌స్టాగ్రామ్‌లో స్టోరీల సమయాన్ని తొంబై సెకెండ్లకు పెంచింది. టెక్‌ క్రంచ్‌ రిపోర్ట్‌ ప్రకారం టైమ్‌ లిమిట్‌ అరవై సెకండ్లకు అంటే ఒక నిమిషానికి పెంచారు.


ఇంతకు ముందు ఈ  పరిమితి పదిహేను సెకండ్లు మాత్రమే. స్టోరీ నిడివి ఎక్కువ ఉంటే, ముక్కలు ముక్కలుగా పంపుకోవాల్సి వచ్చేది. అలా చేయడం వల్ల అప్‌లోడింగ్‌ కూడా ఇబ్బందికరంగా ఉండేది. పదిహేను సెకండ్ల నిడివితో ముక్కలుగా బదులు ఇప్పుడు ఒక నిమిషం స్టోరీలను పంపుకోవచ్చని మెటా అధికార ప్రతినిధి ‘టెక్‌క్రంచ్‌’కు వెల్లడించారు. 


దీంతో అంతరాయాలకు తావివ్వని రీతిలో స్టోరీలను పంపుకొనే వెసులుబాటు ఇన్‌స్టాగ్రామ్‌ యూజర్లకు కలుగుతుంది. తల్లిదండ్రులు లేదా గార్డియన్స్‌కు పిల్లల వ్యవహారాలను పర్యవేక్షించేందుకుగాను టూల్స్‌ను ఈ నెల మొదట్లోనే పరిచయం చేసింది. ఫ్యామిలీ సెంటర్‌ పేరిట మరొకటి కూడా తేనుంది. దీంతో సూపర్విజన్‌ టూల్స్‌, నిపుణుల రిసోర్సులు అందుబాటులోకి వస్తాయి. ప్రతి రోజు అలాగే వారానికి స్ర్కీనింగ్‌ టైమ్‌ను లిమిట్‌ చేసే అవకాశం ఈ టూల్‌తో యూజర్లకు అందుబాటులోకి వస్తుంది. తమ పిల్లల విషయంలో పేరెంట్స్‌ ఎప్పటికప్పుడు అప్‌డేట్‌గా ఉండేందుకూ వీలవుతుంది. 

Updated Date - 2022-10-01T06:03:01+05:30 IST