TikTok లో సుప్రీంకోర్టు న్యాయమూర్తుల క్రెడిట్ కార్డు వివరాలు వైరల్!

ABN , First Publish Date - 2022-07-02T02:47:13+05:30 IST

అమెరికా మహిళలకు అబార్షన్ హక్కును దూరం చేసిన సుప్రీంకోర్టు తీర్పు తీర్పుపై అగ్రరాజ్యంలో ఇప్పటికీ విమర్శలు వ్యక్తమవుతూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో అమెరికాలో మరో సంచలన విషయం వెలుగులోకి వచ్చింది.

TikTok లో సుప్రీంకోర్టు న్యాయమూర్తుల క్రెడిట్ కార్డు వివరాలు వైరల్!

ఎన్నారై డెస్క్: మహిళలకు అబార్షన్ హక్కును దూరం చేసిన అమెరికా సుప్రీంకోర్టు తీర్పుపై అగ్రరాజ్యంలో ఇప్పటికీ విమర్శలు వ్యక్తమవుతూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో అమెరికాలో మరో సంచలన విషయం వెలుగులోకి వచ్చింది. అబార్షన్‌ హక్కును వ్యతిరేకిస్తూ తీర్పు వెలువరించిన కొందరు న్యాయమూర్తుల క్రెడిక్ కార్డు వివరాలు టిక్‌టాక్‌లో వైరల్ అవుతున్నాయి. ఆ వివరాలు న్యాయమూర్తులవేనంటూ కొందరు యూజర్లు వీడియోలను వైరల్ చేస్తున్నారు. దాదాపు 50 ఏళ్ల క్రితం మహిళలకు అబార్షన్ హక్కును కల్పిస్తూ సుప్రీం కోర్టు.. రో వర్సెస్ వేడ్ కేసులో ఇచ్చిన తీర్పును ఇటీవల అమెరికా సర్వోన్నత న్యాయస్థానం కొట్టేసిన విషయం తెలిసిందే. తొమ్మిది మంది న్యాయమూర్తుల విస్తృత ధర్మాసనంలో ఐదుగురు అబార్షన్ హక్కును వ్యతిరేకించగా..నలుగురు అనుకూలంగా తీర్పు వెలువరించారు. 


ఇక టిక్‌టాక్ సాఫ్ట్‌వేర్‌కు దొరక్కుండా ఫొటోల్లో మార్పులు చేసి స్టైడ్ షోలను వైరల్ చేస్తున్నారట. ఆ వీడియోల్లో న్యాయమూర్తుల క్రెడిట్ కార్డు నెంబర్, ఎక్స్‌పైరీ డేట్, సెక్యురిటీ కోడ్ వంటివి ఉన్నాయట.  ఆ సమాచారం నిజమైనదా కాదా అన్న విషయంలో స్పష్టత లేకపోయినప్పటికీ..కొందరు యూజర్లు మాత్రం ‘‘అనుకున్న ఫలితం వచ్చింది’’ అంటూ కామెంట్లు పెడుతున్నారు. మరి కొన్ని వీడియోల్లో ఆ న్యాయమూర్తుల ఇంటి అడ్రస్‌లు కూడా దర్శనమిచ్చాయట. అయితే.. న్యాయమూర్తుల చిరునామాలు అంతకుముందే ప్రజలకు తెలుసని పరిశీలకులు చెబుతున్నారు. సుప్రీం తీర్పుకు ముందే తీర్పు నకలు లీకవడంతో..కొందరు న్యాయమూర్తుల ఇంటి ముందు కొందరు నిరసన ప్రదర్శన నిర్వహించినట్టు చెప్పారు. కాగా.. దీనిపై టిక్‌టాక్ కూడా స్పందించింది. వ్యక్తిగత వివరాలతో కూడిన సమాచారాన్నంతా తొలగిస్తామని పేర్కొంది. 

Updated Date - 2022-07-02T02:47:13+05:30 IST