Abn logo
Jul 12 2020 @ 16:36PM

బిజినెస్‌మేన్ హత్యకేసులో టిక్‌టాక్ స్టార్ అరెస్ట్!

బెంగళూరు: కర్ణాటక రాజధాని బెంగళూరుకు చెందిన ఓ బిజినెస్‌మేన్ హత్యకేసులో టిక్‌టాక్ స్టార్ అరెస్టయ్యాడు. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. బెంగళూరుకు చెందిన వ్యాపారవేత్త వినోద్ కుమార్‌ను ఇటీవల కొందరు దుండగులు హత్యచేశారు. సోదరి ఇంటి నుంచి తిరిగొస్తుండగా ఎనిమిది మంది దుండగులు బైకులపై వచ్చి వినోద్‌ కారును అడ్డగించారు. కారు ఆగగానే వినోద్‌ను వాహనంలో నుంచి బయటకు లాగి హత్యచేశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దర్యాప్తు చేస్తున్నారు. ఈ క్రమంలో టిక్‌టాక్ స్టార్ నవీన్‌తోపాటు మరో 12మందిని అరెస్టు చేశారు.

Advertisement
Advertisement
Advertisement