టిక్‌టాక్‌ను బ్యాన్ చేసేందకు అమెరికా కుట్ర: బైట్‌డాన్స్

ABN , First Publish Date - 2020-08-05T03:12:57+05:30 IST

టిక్‌టాక్‌ను బ్యాన్ చేసేందుకు అమెరికా కుట్ర చేస్తోందని మాతృసంస్థ బైట్ డాన్స్ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ మేరకు...

టిక్‌టాక్‌ను బ్యాన్ చేసేందకు అమెరికా కుట్ర: బైట్‌డాన్స్

బీజింగ్: టిక్‌టాక్‌ను బ్యాన్ చేసేందుకు అమెరికా కుట్ర చేస్తోందని మాతృసంస్థ బైట్ డాన్స్ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ మేరకు సంస్థ వ్యవస్థాపకుడు ఝాంగ్ ఇమింగ్ తన సిబ్బందికి రాసిన లేఖలో పాల్గొన్నారు. టిక్‌టాక్‌ను అమ్ముకునేలా సంస్థపై ఒత్తిడి తీసుకురావడం అమెరికా లక్ష్యం కాదని, ఎలాగైనా యాప్‌ను బ్యాన్ చేయాలని చూస్తోందని ఆరోపించింది. అయితే ప్రస్తుతం అమెరికాలో టిక్‌టాక్‌కు సంబంధించి నెలకొన్న అన్ని సమస్యలను తీర్చుకునేందుకు యాజమాన్యం ప్రయత్నిస్తోందని ఇమింగ్ తెలిపారు. అంతేకాకుండా టిక్‌టాక్‌ను వేరేవారికి విక్రయించడంపై కూడా సంస్థ పూర్తి స్థాయిలో నిర్ణయం తీసుకోలేదని, దానిపై మరింత ఆలోచన చేయాల్సి ఉందని పేర్కొన్నారు.

Updated Date - 2020-08-05T03:12:57+05:30 IST