Apple memojiకి పోటీ.. అవతార్స్‌ను రంగంలోకి దించిన TikTok..!

ABN , First Publish Date - 2022-06-09T22:22:09+05:30 IST

ప్రస్తుతం యాపిల్ ఉత్పత్తులు వాడే వారికి మెమోజీలు పరిచయమే. వాటితో వారు చేసి ఫన్నీ వీడియోలు కూడా పరిచయమే.

Apple memojiకి పోటీ.. అవతార్స్‌ను రంగంలోకి దించిన TikTok..!

ప్రస్తుతం యాపిల్ ఉత్పత్తులు వాడే వారికి మెమోజీలు పరిచయమే. వాటితో వారు చేసే ఫన్నీ వీడియోలు కూడా పరిచయమే. యాపిల్ మెమోజీలకు పోటీగా టిక్‌టాక్ మరో కొత్త ఫిల్టర్‌ను రంగంలోకి దించింది. ఆ కొత్త ఫిల్టర్ పేరు `అవతార్స్`. దీని ద్వారా మీ ఫేస్ ఎక్స్‌ప్రెషన్స్‌ను అనుకరించే యానిమేటడ్ క్యారెక్టర్‌లను సృష్టించవచ్చు. దీని ద్వారా మీరు కనబడకుండానే మీ `స్టోరీ టైమ్స్`ను పోస్ట్ చేయవచ్చు. టిక్‌టాక్ గురువారం ఈ అవతార్స్‌ను పరిచయం చేసింది. ఇవి యాపిల్ మెమోజీల లాగానే కనిపిస్తున్నాయి.


ఇది కూడా చదవండి..

అంటార్కిటిక్ ప్రాంతంలో కురిసిన మంచును చూసి అవాక్కైన పరిశోధకులు.. కారణమేంటో తెలిస్తే భయం ఖాయం!


ఈ యాప్ మీ కెమెరాను ఉపయోగించి మీ ముఖ కవళికలను రికార్డ్ చేసుకుంటుంది. వాటి ఆధారంగా యానిమేటెడ్ అవతార్‌ను రూపొందిస్తుంది. దానితో మీరు కావాల్సినన్ని వీడియోలు రికార్డు చేసుకోవచ్చు. మీ మొహం బయటపడకుండా ఆ యానిమేటెడ్ అవతార్‌తో మీ ఎక్స్‌ప్రెషన్స్‌ను పలికించవచ్చు. ప్రస్తుతానికి 24 కంటే ఎక్కువగానే అవతార్‌లు అందుబాటులో ఉన్నాయి. అవేవీ మీకు నచ్చకపోతే మీరే స్వంతంగా మరో అవతార్‌ని తయారు చేసుకోవచ్చు. మీ కళ్లు, ముక్కు, నోరు, స్కిన్ టోన్ ఆధారంగా అవతార్‌లో మార్పులు చేసుకోవచ్చు. అలాగే నగలు పెట్టడం, తలపాగా తగిలించడం లాంటివి కూడా చేయవచ్చు. 


హెయిర్ స్టైల్‌లో మాత్రం పరిమితమైన ఆప్షన్స్ మాత్రమే ఉన్నాయి. వినియోగదారుల సలహా, సంప్రదింపులతో తమ అవతార్స్‌ను నిరంతరం అప్‌డేట్స్ చేస్తామని టిక్‌టాక్ ప్రకటించింది. యాపిల్ మెమోజీలతో పోల్చుకుంటే టిక్‌టాక్ అవతార్స్ ఫన్, లుక్స్, ఫీచర్స్ కొంచెం మెరుగ్గా ఉన్నాయనే విశ్లేషణ వినిపిస్తోంది. కొత్త కస్టమైజేషన్ ఆప్షన్స్ తీసుకొచ్చి అవతార్స్‌ను మరింతగా వినియోగదారులకు చేరువ చేస్తామని టిక్‌టాక్ చెబుతోంది. 

Updated Date - 2022-06-09T22:22:09+05:30 IST