ట్రంప్ ఆదేశాలపై కోర్టుకెక్కిన టిక్‌టాక్!

ABN , First Publish Date - 2020-09-19T19:30:01+05:30 IST

టిక్‌టాక్‌పై అమెరికా ప్రభుత్వం విధించిన బ్యాన్‌ను వ్యతిరేకిస్తూ.. దాని మాతృసంస్థ బైట్‌డ్యాన్స్ వాషింగ్టన్‌లోని ఫెడరల్‌ కోర్టును ఆశ్రయించింది. ట్రంప్ తన అధికారాలను

ట్రంప్ ఆదేశాలపై కోర్టుకెక్కిన టిక్‌టాక్!

వాషింగ్టన్: టిక్‌టాక్‌పై అమెరికా ప్రభుత్వం విధించిన బ్యాన్‌ను వ్యతిరేకిస్తూ.. దాని మాతృసంస్థ బైట్‌డ్యాన్స్ వాషింగ్టన్‌లోని ఫెడరల్‌ కోర్టును ఆశ్రయించింది. ట్రంప్ తన అధికారాలను దుర్వినియోగం చేశారని.. బైట్‌డ్యాన్స్ తన లాసూట్‌లో పేర్కొంది. రాజకీయ కారణాలతో టిక్‌టాక్‌ను అమెరికాలో బ్యాన్ చేశారని ఆరోపించింది. అమెరికా పౌరుల ప్రైవసీకి, దేశ భద్రతకు.. కట్టుబడి ఉన్నట్లు తెలిపింది. టిక్‌టాక్‌ను బ్యాన్ చేయడం ద్వారా ట్రంప్ సర్కార్.. భావ ప్రకటన స్వేచ్ఛ హక్కులను ఉల్లఘించిందని విమర్శించింది. కాగా.. టిక్‌టాక్ విషయంలో అమెరికా ప్రభుత్వానికి వ్యతిరేకంగా బైట్‌డ్యాన్స్ కోర్టును ఆశ్రయించడం ఇది రెండోసారి. ఇదిలా ఉంటే.. టిక్‌టాక్, వుయ్‌చాట్‌లపై విధించిన నిషేధాజ్జలు.. ఆదివారం నుంచి అమలులోకి వస్తాయని ట్రంప్ సర్కార్ ఓ ప్రకటనలో తెలిపింది. అంతేకాకుండా యాప్‌స్టోర్‌ల నుంచి కూడా వాటిని తొలగించాలని ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. 


Updated Date - 2020-09-19T19:30:01+05:30 IST