టిక్‌టాక్ షాకింగ్ నిర్ణయం.. భలే బిజినెస్ ప్లాన్ వేశారుగా..!

ABN , First Publish Date - 2020-07-10T22:39:38+05:30 IST

చైనా యాప్స్ నిషేధంలో భాగంగా భారత్‌లో నిషేధానికి గురైన టిక్‌టాక్ సంస్థ...

టిక్‌టాక్ షాకింగ్ నిర్ణయం.. భలే బిజినెస్ ప్లాన్ వేశారుగా..!

బీజింగ్: చైనా యాప్స్ నిషేధంలో భాగంగా భారత్‌లో నిషేధానికి గురైన టిక్‌టాక్ సంస్థ కొత్త ఎత్తులు వేస్తోంది. భారత్ టిక్‌టాక్‌ను నిషేధించడంతో కోట్ల మంది యూజర్లను కోల్పోయి.. తీవ్ర నష్టాలను చవిచూసిన ఈ సంస్థ తాజాగా అమెరికా కూడా నిషేధించే యోచనలో ఉందన్న వార్తలతో అప్రమత్తమైంది. తమది చైనా యాప్ అయినప్పటికీ.. పక్షపాతంగా వ్యవహరించలేదని, ఇతర దేశ పౌరుల వ్యక్తిగత సమాచారాన్ని చైనాకు చేరవేయలేదని ఇప్పటికే ప్రకటించిన టిక్‌టాక్ ఆ ఆరోపణల నుంచి బయటపడటానికి విశ్వ ప్రయత్నాలు చేస్తోంది. అమెరికా కూడా నిషేధిస్తే సంస్థ మనుగడకే ముప్పు వాటిల్లే అవకాశం ఉండటంతో కొత్త పల్లవిని అందుకుంది. తాజాగా టిక్‌టాక్ మాతృ సంస్థ బైట్‌డ్యాన్స్‌లో మార్పులుచేర్పులకు శ్రీకారం చుట్టింది.


అందులో భాగంగా.. బీజింగ్‌ నుంచి తమ ప్రధాన కార్యాలయాన్ని తరలించాలని భావిస్తోంది. అంతేకాదు, కొత్త కార్యనిర్వాహక బోర్డును ఏర్పాటు చేసే యోచనలో బైట్‌డ్యాన్స్ ఉన్నట్లు తెలిసింది. తద్వారా.. చైనా ముద్రను తొలగించుకోవాలన్నది బైట్‌డ్యాన్స్ వ్యూహంగా తెలుస్తోంది. టిక్‌టాక్, హెలో యాప్‌లు రెండింటికి బైట్‌డ్యాన్స్ మాతృ సంస్థ కావడం గమనార్హం. ఈ రెండు యాప్‌లు నడవాలంటే చైనాకు దూరం దూరంగా ఉండాల్సిందేనని బైట్‌డ్యాన్స్ భావిస్తోంది.

Updated Date - 2020-07-10T22:39:38+05:30 IST