టిక్‌టాక్‌ బ్యాక్‌డోర్‌ ఎంట్రీ!

ABN , First Publish Date - 2021-07-24T05:34:12+05:30 IST

చిన్న అక్షరం మార్పుతో టిక్‌టాక్‌ మళ్ళీ మన దేశంలోకి వచ్చే యత్నం చేస్తోంది.

టిక్‌టాక్‌ బ్యాక్‌డోర్‌ ఎంట్రీ!

చిన్న అక్షరం మార్పుతో టిక్‌టాక్‌ మళ్ళీ మన దేశంలోకి వచ్చే యత్నం చేస్తోంది. tiktok బదులుగా ticktock పేరుతో  ఎంటర్‌ కావడానికి ట్రేడ్‌ మార్కును రిజిస్ట్రేషన్‌ కోసం నమోదు చేసింది. ‘పబ్జీ’ ఇప్పటికే ‘బ్యాటిల్‌ గ్రౌండ్స్‌ మొబైల్‌ ఇండియా’ పేరిట మన దేశంలో అడుగుపెట్టింది.   పబ్జీ, టిక్‌టాక్‌ను గత ఏడాది మనదేశం నిషేధించిన విషయం తెలిసిందే. ‘టిక్‌టాక్‌’ ఇంకా ఆమోదం పొందాల్సి ఉంది. ‘మార్క్‌డ్‌ ఫర్‌ ఎగ్జామ్‌’ అని వెబ్‌సైట్‌లో ప్రస్తుతానికి చూపిస్తోంది. ఇండియాలోకి వచ్చేందుకు టిక్‌టాక్‌ యత్నిస్తున్నట్టు ‘బ్లూమ్‌బర్గ్‌ న్యూస్‌’ ఈ ఏడాది ఫిబ్రవరిలోనే పేర్కొంది. ఇండియాలో రెండు వేలకు మించి ఉన్న సిబ్బందిని ఈ సంస్థ తగ్గించిందని రాయిటర్స్‌ పేర్కొంది. అలాగే మన దేశంలో తిరిగి కార్యకలాపాలను పునఃప్రారంభించడంపై గట్టిగా ఏమీ హామీ కూడా ఇవ్వలేదు. ఈ నేపథ్యంలో టిక్‌టాక్‌ అక్షరం మార్చుకుని వస్తుందా లేదా అన్నది వేచి చూడాలి. టిక్‌టాక్‌ అంతర్థానంతో ఇతర షార్ట్‌ వీడియో యాప్‌లు పుంజుకున్నాయి.  


Updated Date - 2021-07-24T05:34:12+05:30 IST