Abn logo
Aug 4 2021 @ 11:44AM

తీహార్ జైలులో అనుమానాస్పద స్థితిలో గ్యాంగ్‌స్టర్ మృతి!

న్యూఢిల్లీ: దేశరాజధాని ఢిల్లీలోని తీహార్ జైలులో ఖైదీగా ఉన్న గ్యాంగ్‌స్టర్ ఉగ్రవాది గుర్జర్ అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. దీనిపై జైలు అధికారులు దర్యాప్తు ప్రారంభించారు. గ్యాంగ్‌స్టర్ ఉగ్రవాది గుర్జర్ మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ఢిల్లీలోని దీన్‌దయాళ్ ఆసుపత్రికి తరలించారు. పోస్టుమార్టం అనంతరం మృతికిగల కారణాలు, సమయం మొదలైన వివరాలు వెల్లడి కానున్నాయి. అయితే గుర్జర్‌ను ఎవరో హత్య చేశారని అతని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఇప్పటివరకూ అధికారికంగా ఈ ఉదంతానికి సంబంధించిన వివరాలు వెల్లడికాలేదు.