బెజ్జూరు సరిహద్దుల్లో పులి సంచారం

ABN , First Publish Date - 2021-03-07T05:44:44+05:30 IST

కొద్ది నెలలుగా తప్పించుకొని తిరుగుతున్న పెద్దపులి ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తూనే ఉంది. అటవీశాఖ అధికారులకు చిక్క కుండా ముప్పు తిప్పలు పెడుతున్న పులి తాజాగా బెజ్జూరు మండలకేంద్రం సమీపంలోని బోలు చెరువు వద్ద శుక్రవారం రాత్రి సంచరించినట్లు దాని అడుగులు గుర్తించారు.

బెజ్జూరు సరిహద్దుల్లో పులి సంచారం
బోలు చెరువు వద్ద గుర్తించిన పులి అడుగులు

  - బోలు చెరువు వద్ద అడుగుల గుర్తింపు

  - భయాందోళనలో ప్రజలు

బెజ్జూరు, మార్చి 6: కొద్ది నెలలుగా తప్పించుకొని తిరుగుతున్న పెద్దపులి ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తూనే ఉంది. అటవీశాఖ అధికారులకు చిక్క కుండా ముప్పు తిప్పలు పెడుతున్న పులి తాజాగా బెజ్జూరు మండలకేంద్రం సమీపంలోని బోలు చెరువు వద్ద శుక్రవారం రాత్రి సంచరించినట్లు దాని అడుగులు గుర్తించారు. దీంతో ప్రజలు భయాందోళ నకు గురవుతున్నారు. పులి సుశ్మీర్‌ అటవీ ప్రాంతం నుంచి బోలు చెరువు వద్దకు వచ్చినట్లు అటవీ అధికారులు భావిస్తున్నారు. బోలు చెరువు వద్ద పులి అడుగుల జాడలను పరిశీలించగా అక్కడి నుంచి బెజ్జూరు అడవుల్లోకి వెళ్లినట్లు అటవీ అధికారులు గుర్తిం చారు. ఇటీవల మండల సరిహద్దులతో పాటు పెంచికల పేట, దహెగాం మండలాల పరిధిలోని అటవీగ్రామాల సమీపంలో పులి తరచూ కనిపిస్తుండటంతో ఆయా అటవీ గ్రామాల ప్రజలకు నిత్యం కంటి మీద కునుకు లేకుండా పోతోంది. ఇటీవల పెంచికలపేట మండలంలోని గుండేపల్లి గ్రామంలోకి వచ్చిపశువుల పాకలో కట్టేసిన పశు వుపై దాడి చేసి చంపడంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. బెజ్జూరు సమీపంలోని బోలు చెరువు కూడా గ్రామానికి అత్యంత సమీపంలోనే ఉంది. ఈ ప్రాంతానికి పులి రావడంతో ఇక్కడి ప్రజలు వణికిపోతున్నారు.

ఫ ఏ-2నా.. కె-8 అన్న అనుమానాలు..

ఇటీవల అధికంగా బెజ్జూరు, దహెగాం, పెంచికల్‌ పేట మండలాల్లో తరచూ తచ్చాడిన పెద్దపులిపై పలు అనుమా నాలు నెలకొన్నాయి. ఇటీవల పలు మండలాల్లో తరచూ పశవులపై దాడిచేస్తూ హతమారు స్తున్న పులి ఏ-2గా నిర్ధారించినా బోలు చెరువు వద్ద రాత్రి సంచరించిన పులి కె-8 అన్న అనుమానాలను వ్యక్తమవుతున్నాయి. ఏ-2పులి అడుగు జాడలు బోలు చెరువు వద్ద కనిపిం చిన పులి అడుగులు రెండింటికి తేడాలు ఉన్నట్లు అటవీఅధికారి ఒకరు పేర్కొన్నారు. కడంబా అటవీ ప్రాంతంలో ఆవాసం ఏర్పాటు చేసు కున్న కె-8పులి మూడు నెలలుగా ఆచూకీ దొరక్కపోవడంతో మహారాష్ట్రకు వెళ్లినట్లు భావిం చిన అటవీ శాఖ అధికారులకు తాజాగా కనిపించిన పులి అదే కావచ్చని అనుమానిస్తున్నారు.

కనిపించిన పులి..

పెంచికలపేట, మార్చి 6: పెంచికలపేట-బెజ్జూరు ప్రధాన రహదారిపై గొల్లదేవర సమీపాన పులి ప్రయాణికులకు కనిపిం చింది. ఆర్టీసీ బస్సులో ప్రయాణిస్తున్న ప్రయాణికులు పులిని గమనించడంతో బస్సు డ్రైవర్‌ కొద్దిసేపు బస్సును నిలిపాడు. పులిని చూసిన ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు. ఈ విషయమై ఎఫ్‌ఆర్వోను వివరణ కోరగా ఉదయం 10గంటల ప్రాంతంలో పులి కనిపించిన మాట వాస్తవమేనని అన్నారు. 

Updated Date - 2021-03-07T05:44:44+05:30 IST