పులి దాడి నుంచి ఇద్దరు పిల్లలతో తప్పించుకున్న మహిళ

ABN , First Publish Date - 2022-05-11T14:42:34+05:30 IST

ఇద్దరు పిల్లలతో స్కూటర్‌పై వెళుతున్న మహిళ రెప్పపాటులో పులిదాడి నుంచి బయటపడింది. తన వెనకాలే పులి వస్తుండగా బైక్‌ వేగం పెంచి ముందుకెళ్లింది. ఆలోగా బైక్‌కు

పులి దాడి నుంచి ఇద్దరు పిల్లలతో తప్పించుకున్న మహిళ

ఐసిఎఫ్‌(చెన్నై): ఇద్దరు పిల్లలతో స్కూటర్‌పై వెళుతున్న మహిళ రెప్పపాటులో పులిదాడి నుంచి బయటపడింది. తన వెనకాలే పులి వస్తుండగా బైక్‌ వేగం పెంచి ముందుకెళ్లింది. ఆలోగా బైక్‌కు ఎదురుగా ఒక కారు రాగా ఆ వాహనం లైట్ల కాంతి పులి కళ్లలో పడడంతో అది పొదల్లోకి వెళ్లిపోయింది. ఆ లోగా ఆ మహిళ అక్కడి నుంచి వేగంగా దూసుకెళ్లింది. ఈ ఘటన ఈరోడ్‌ జిల్లాలో జరిగింది. సెంగాలికోటపుదూర్‌ గ్రామానికి చెందిన రైతు కార్తీక్‌, అనిత (37) దంపతులకు ఇద్దరు పిల్లలున్నారు. ఆదివారం ఉదయం అనిత తన ఇద్దరు పిల్లలతో తాండాంపాళయంలోని బంధువుల ఇంటికి బైక్‌పై వెళ్లి తిరిగి సాయంత్రం తిరుగుప్రయాణమైంది. ఊంజిక్కాడువలసు అనే అడవి మార్గం గుండా అనిత వస్తుండగా, రోడ్డు పక్కనే పడుకొని ఉన్న పులి హఠాత్తుగా వారిపై దాడిచేసేందుకు యత్నించింది. దీంతో అనిత బైక్‌ను వేగంగా నడుపగా పులి వెంటపడింది. అదే సమయంలో ఎదురుగా వచ్చిన కారు లైట్ల వెలుగుతో పులి సమీపంలోని పొదల్లోకి వెళ్లిపోయింది. సమాచారం అందుకున్న అటవీ శాఖ అధికారులు ఆ ప్రాంతంలో పులి ఆచూకీ కనుగొనేలా సీసీ కెమెరాలు ఏర్పాటుచేసి, రాత్రివేళల్లో ఆ ప్రాంతంలో వెళ్లే వాహనచోదకులు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు.

Read more