వైరల్.. పులి నిగ్రహించుకుంది కాబట్టి సరిపోయింది.. లేకపోతే..!

ABN , First Publish Date - 2021-01-25T01:00:31+05:30 IST

అడవిలో సఫారీ.. పచ్చటి చెట్లు..జంతువులు.. పక్షులు.. అబ్బో..ఆ ప్రకృతి అందాన్ని చూసి ఎవరైనా సరే మైమరచిపోవాల్సిందే. కానీ..మనల్ని అవలీలగా మంత్రముగ్ధుల్నీ చేసే అడవిలోనే ఏదో రూపంలో ప్రమాదం మనల్ని నిరంతరం వెన్నాడుతుంటుంది. ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా ఇక అంతే సంగతులు. చేతిలో కెమెరా ఉంది కదా అని జంతువుల తీరు తెన్నులను లెక్కచేయకుండా ఫోటోలు తీసుకుంటూ గోల చేస్తు వెళితే ఒక్కసారిగా ప్రమాదం ముంచుకొస్తుంది. ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఓ వీడియో ప్రస్తుతం మనకు ఇదే పాఠం చెబుతోంది.

వైరల్.. పులి నిగ్రహించుకుంది కాబట్టి సరిపోయింది.. లేకపోతే..!

ఇంటర్నెట్ డెస్క్: అడవిలో సఫారీ.. పచ్చటి చెట్లు..జంతువులు.. పక్షులు.. అబ్బో..ఆ ప్రకృతి అందాన్ని చూసి ఎవరైనా సరే  మైమరచిపోవాల్సిందే. కానీ..మనల్ని అవలీలగా మంత్రముగ్ధుల్నీ చేసే అడవిలోనే ఏదో రూపంలో ప్రమాదం మనల్ని నిరంతరం వెన్నాడుతుంటుంది. ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా ఇక అంతే సంగతులు. చేతిలో కెమెరా ఉంది కదా అని జంతువుల తీరు తెన్నులను లెక్కచేయకుండా ఫోటోలు తీసుకుంటూ గోల చేస్తు వెళితే ఒక్కసారిగా ప్రమాదం ముంచుకొస్తుంది. ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఓ వీడియో మనకు ఇదే పాఠం చెబుతోంది. అటవీ శాఖ అధికారి సుశాంత నందా దీన్ని ట్విటర్‌లో షేర్ చేశారు. అడవిలో క్రూర జంతువులు ఉంటాయని తెలిసీ అజాగ్రత్తగా తమమానాన తాము ఫోటోలు తీసుకుంటూ పోయిన పర్యటకులకు ఓ పులి ఊహించని షాకిచ్చింది. పులికి, వారికీ మధ్యలో ఓ గోడ అడ్డంగా ఉన్నప్పటికీ అది ఒక్కసారిగా గోడపైకి దూకుతుంది.


ఫోటోలు తీసుకుంటున్న పర్యటకులకు అత్యంత సమీపంలోకి వస్తుంది..! పర్యటకుల గోలకు పులి చిరాకు పడిందా..? దానికి ఒక్కసారిగా తిక్కరేగిందా.. అన్నట్టు ఉంటుంది ఈ దృశ్యం! అక్కడున్న వారిలో ఒక్కసారిగా అలజడి.. నెక్ట్స్ ఏం జరుగుతుందా అని ఊపిరి బిగపట్టి చూస్తున్న తరుణంలో పులి తన దారిన తాను వెళ్లిపోతుంది. ఈ విషయాన్ని సుశాంత నందా తన ట్వీట్‌లో పేర్కొన్నారు. పులి తనను తాను నిగ్రహించుకుందంటూ కామెంట్ పెట్టారు. పర్యటకులు మాత్రం ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారంటూ అసంతృప్తి కూడా వ్యక్తం చేశారు. ప్రస్తుతం నెట్టింట్లో హల్‌చల్ చేస్తున్న ఈ వీడియో..మీ కోసం..! 



Updated Date - 2021-01-25T01:00:31+05:30 IST