చిట్యాల అడవుల్లో పెద్దపులి

ABN , First Publish Date - 2022-06-30T05:37:45+05:30 IST

చిట్యాల అడవుల్లో పెద్దపులి

చిట్యాల అడవుల్లో పెద్దపులి

కాకతీయఖని/చిట్యాల/టేకుమట్ల, జూన్‌ 29: నాలుగు రోజులగా భూపాలపల్లి రేంజ్‌ పరిధిలో సంచరించిన పెద్ద పులి ప్రస్తుతం చిట్యాల అడవుల్లో ఉన్నట్టు తెలుస్తోంది. భూపాలపల్లి రేంజ్‌లోని నాచారం అడవులు మానేరు మీదుగా టేకుమట్ల మండలం రాఘవపూర్‌, వెలిశాల గుట్టల ప్రాంతానికి వెళ్లినట్టు చెల్పూర్‌ రేంజర్‌ నాగరాజు తెలిపారు.  ఈ మేరకు బుధవారం పెద్దపులి పాదముద్రలు గుర్తించినట్టు పేర్కొన్నారు. అక్కడి నుంచి చిట్యాల మండలం నవాబ్‌పేట శివారు శాంతినగర్‌ అటవీ ప్రాంతం మీదుగా చైన్‌పాక వైపు పులి వెళ్లినట్టు తెలుస్తోందన్నారు. చీకటి పడడంతో పులి కోసం అన్వేష ణను నిలిపివేశామని తెలిపారు. గురువారం తెల్లవారు జామున కొనసాగిస్తామన్నారు.    

Updated Date - 2022-06-30T05:37:45+05:30 IST