విశాఖ జిల్లా వైపు పెద్దపులి అడుగులు

ABN , First Publish Date - 2022-06-30T06:25:01+05:30 IST

కాకినాడ జిల్లాలో సుమారు 40 రోజు లుగా వివిధ ప్రాంతాల్లో తిరు గుతూ ముప్పుతిప్పలు పెట్టిన పెద్ద పులి విశాఖ జిల్లా వైపు అడుగులు వేసింది.

విశాఖ జిల్లా వైపు పెద్దపులి అడుగులు

తుని, జూన్‌ 29: కాకినాడ జిల్లాలో సుమారు 40 రోజు లుగా వివిధ ప్రాంతాల్లో తిరు గుతూ ముప్పుతిప్పలు పెట్టిన పెద్ద పులి విశాఖ జిల్లా వైపు అడుగులు వేసింది. బుధ వారం అధికారులు గుర్తించిన పులి పాదముద్రలు బట్టి పులి కాకినాడ జిల్లాను దాటి వెళ్లిపోయిందనే విషయం స్పష్టమైంది. మే 21న తొలిసారిగా పులి ఉనికిని ప్రత్తిపాడు మండలంలో గుర్తించారు. ఎప్పుడు ఎటువైపు దాడి చేస్తుందోనని బిక్కుబిక్కుమంటూ ప్రజలు గడిపారు. సుమారు 150 మంది సిబ్బందితో పాటు అటవీశాఖ ఉన్నతాధికారులు, ఇతర రాష్ర్టాలకు చెందిన నిపుణులు ఎన్ని వ్యూహాలు రచించినా వారి ఎత్తుగడలను పులి పసిగట్టి చిక్కకుండా తప్పించుకుని తిరిగింది. బోను, సీసీ కెమెరాలు ఏర్పాటుచేసి దాని కదలికలను గుర్తించినా అది అధికారులకు చెమటలు పట్టించింది తప్ప చిక్కలేదు. సుమారు 11 పశువులను చంపి తినడంతో పాటు మరో 10 పశువులపై పులి దాడి చేసింది. ప్రత్తిపాడు నియోజకవర్గంలో మెట్ట ప్రాంతాల్లో తిరుగుతూ మైదాన ప్రాంతాన్ని టచ్‌ చేసి తిరిగి అటవీ ప్రాంతంలోకి వెళ్తూ కొన్నిరోజులు ఎటువంటి కదలికలు లేకుండా ఇలా అనేక రకాలుగా అంతుచిక్కని రీతిలో పులి సంచరించింది. ప్రత్తిపాడు నియోజకవర్గం నుంచి తుని నియోజకవర్గం కుమ్మరిలోవ పరిసర ప్రాంతాల్లో సంచరించిన పులి తాండవ నదిని దాటి విశాఖ జిల్లాలోకి ప్రవేశించినట్టు పాదముద్రల ద్వారా అధికారులు గుర్తించారు. కోటవురట్ల మండలం తడపర్తి-రేబాక ప్రాంతాల మధ్య ఒక గేదెపై పులి దాడి చేసినట్లు అధికారులు గుర్తించారు. విశాఖ జిల్లాలో ప్రస్తుతం పులి సంచరిస్తున్నా అక్కడ దానికి అనుకూల పరిస్థితులు లేకపోతే తిరిగి వెనక్కి మళ్లి గతంలో సంచరించిన ప్రాంతాలకు రావచ్చని అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో మరికొంత కాలం పాటు జిల్లా ప్రజలు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందంటున్నారు. 

Updated Date - 2022-06-30T06:25:01+05:30 IST