మేకల మందపై పులి దాడి

ABN , First Publish Date - 2021-11-28T04:19:33+05:30 IST

మండలంలోని ఖర్జీ అటవీ ప్రాంతంలో శనివారం మేకలమందపై పులి దాడి చేసింది. దీంతో భయబ్రాంతులకు గురైన కాపరి మహేష్‌ చెట్టుపైకి ఎక్కి గ్రామస్థులకు, అటవీ శాఖా ధికారులకు సమాచారం అందించాడు. ఎఫ్‌బీవోలు మధుకర్‌, రమేష్‌, రాకేష్‌, గ్రామస్థులు కలిసి అటవీ ప్రాంతానికి వెళ్లి సంఘటన స్థలాన్ని పరిశీలించారు.

మేకల మందపై పులి దాడి

దహెగాం, నవంబరు 27: మండలంలోని ఖర్జీ అటవీ ప్రాంతంలో శనివారం మేకలమందపై పులి దాడి చేసింది. దీంతో భయబ్రాంతులకు గురైన కాపరి మహేష్‌ చెట్టుపైకి ఎక్కి గ్రామస్థులకు, అటవీ శాఖా ధికారులకు సమాచారం అందించాడు. ఎఫ్‌బీవోలు మధుకర్‌, రమేష్‌, రాకేష్‌, గ్రామస్థులు కలిసి అటవీ ప్రాంతానికి వెళ్లి సంఘటన స్థలాన్ని పరిశీలించారు. పులి అడవిపందిని తింటుండగా మేకల మంద రావడంతో దాడికి యత్నించినట్లుగా గుర్తించారు. దీంతో మేకలు చెల్లాచెదురుగా పారిపోయాయి. అయితే పులి దాడిలో ఎటువంటి నష్టం జరగకపోవడంతో గ్రామస్థులు ఊపిరి పీల్చుకున్నారు.

Updated Date - 2021-11-28T04:19:33+05:30 IST