మహబూబాబాద్: జిల్లాలో పులి కదలికలు మరోసారి బయటపడ్డాయి. కొత్తగూడ మండలంలోని కోనాపురం ఎంపీటీసీ భర్త లింగన్న, సోదరుడిపై పులి దాడి చేసింది. ఈ దాడి నుంచి వారు త్రుటిలో తప్పించుకున్నారు. అన్నదమ్ములు తమ బైక్ను అక్కడే పడవేసి అడవిలోకి పరుగులు తీశారు. నర్సంపేట నుంచి కొత్తగూడకు వెళ్తుండగా మార్గమధ్య అటవీ మార్గంలో ఈ ఘటన చోటు చేసుకుంది. సీసీ కెమెరాలు అమర్చి పులి కదలికలను అటవీశాఖ సిబ్బంది పరిశీలిస్తున్నారు.