యువకుడిపై చిరుత దాడి

ABN , First Publish Date - 2021-11-02T18:32:39+05:30 IST

బళ్లారి తాలూకా హరగినడోణి గ్రామంలో ఓ యువకుడిపై చిరుత దాడి చేసి గాయపరిచిన ఘటన శనివారం సాయంత్రం జరిగింది. తక్షణం అటవీ శాఖాధికారులు గుర్తించి చిరుతను పట్టుకొని

యువకుడిపై చిరుత దాడి

బళ్లారి(Karnataka): బళ్లారి తాలూకా హరగినడోణి గ్రామంలో ఓ యువకుడిపై చిరుత దాడి చేసి గాయపరిచిన ఘటన శనివారం సాయంత్రం జరిగింది. తక్షణం అటవీ శాఖాధికారులు గుర్తించి చిరుతను పట్టుకొని కమలాపురం జంతు ప్రదర్శనశాలకు తరలించారు. గ్రామానికి చెందిన మారేశ(20) శనివారం సమీపంలోని అటవీ ప్రాంతానికి వెళ్లారు. అక్కడే పొదల మధ్యకాపుకాసిన చిరుత ఒక్కసారిగా దాడి చేయడంతో అక్కడే ఉన్న వారు గుర్తించి ప్రతిదాడి చేయడంతో చిరుత వెళ్ళిపోయింది. గాయపడిన మారేశ్‌ బళ్లారి విమ్స్‌ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. అటవీశాఖాధికారులు శ్రీకంఠప్ప, మంజునాథ తదితర సిబ్బంది, హరగిణడోణి గ్రామస్థుల సహాయంతో అడవిలో సంచరిస్తున్న చిరుతకు మత్తు మందు ఇచ్చి బోనులో బంధించి కమలాపురం ‘జూ’కి తరలించారు.


Updated Date - 2021-11-02T18:32:39+05:30 IST