వైట్‌హౌస్‌లో చివరి రోజున ట్రంప్ కూతురి నిశ్చితార్థం

ABN , First Publish Date - 2021-01-21T01:17:12+05:30 IST

అమెరికా అధ్యక్షుడి బాధ్యతల నుంచి ట్రంప్ తప్పుకున్నారు. కొద్ది నిమిషాల క్రితమే ఆయన వాషింగ్టన్‌లోని అధ్యక్షుడి అధికారిక

వైట్‌హౌస్‌లో చివరి రోజున ట్రంప్ కూతురి నిశ్చితార్థం

వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడి బాధ్యతల నుంచి ట్రంప్ మరికొద్ది గంటల్లో తప్పుకోనున్నారు. కొద్ది నిమిషాల క్రితమే ఆయన వాషింగ్టన్‌లోని అధ్యక్షుడి అధికారిక నివాసం వైట్‌హౌస్‌ను వీడారు. వాషింగ్టన్ నుంచి ఆయన కుటుంబం ఫ్లోరిడాలోని ఎస్టేట్‌కు వెళ్లింది. ఇదిలా ఉంటే.. ట్రంప్ చిన్న కూతురు తాజాగా పెట్టిన పోస్ట్ ఆసక్తికరంగా మారింది. ట్రంప్ మంగళవారం చివరిగా రోజంతా అధ్యక్షుడిగా ఉన్నారు. ఇదే రోజు ట్రంప్ చిన్న కూతురు టిఫనీ ట్రంప్(27) నిశ్చితార్థం వైట్‌హౌస్‌లో జరిగింది. ఈ విషయాన్ని కొద్ది గంటల క్రితం టిఫనీ ట్రంప్ తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ద్వారా వెల్లడించారు. 


‘వైట్‌హౌస్‌లో గత నాలుగేళ్లలో ఎన్నో చారిత్రాత్మక వేడుకలు జరుపుకున్నాను. వైట్‌హౌస్‌లో నా కుటుంబంతో ఎన్నో జ్ఞాపకాలను ఏర్పరచుకున్నాను. ఇప్పుడు నా నిశ్చితార్థం వాటన్నిటి కంటే ప్రత్యేకమైనది’ అంటూ తనకు కాబోయే భర్త మైఖేల్ బౌలోస్‌తో కలిసి దిగిన ఫొటోను టిఫనీ పోస్ట్ చేశారు. వైట్‌హౌస్‌ను తన తండ్రి వీడుతుండటంతో, మళ్లీ ఇటువంటి అవకాశం రాదేమోనని వైట్‌హౌస్‌లో టిఫనీ నిశ్చితార్థం చేసుకున్నట్టు తెలుస్తోంది. టిఫనీకి కాబోయే భర్త ఆమె కంటే నాలుగేళ్లు చిన్నవాడు కావడం విశేషం. వీరిద్దరూ 2018 నుంచి ప్రేమించుకుంటున్నారు. కాగా.. టిఫనీ ట్రంప్ డొనాల్డ్ ట్రంప్, తన రెండో భార్య మార్లా మేపుల్స్‌కు జన్మించారు.

Updated Date - 2021-01-21T01:17:12+05:30 IST