టిడ్కో గృహాల్లో కొవిడ్‌ సెంటర్‌ : ఆర్డీవో

ABN , First Publish Date - 2021-04-17T03:52:40+05:30 IST

కావలి డివిజన్‌లో కరోనా వ్యాప్తి రోజురోజు పెరుగుతున్నందున పట్టణంలోని మద్దూరుపాడులో నిర్మించిన టిడ్కో గృహాల్లో కొవిడ్‌ సెంటర్‌ ఏర్పాటు చేసినట్లు ఆర్డీవో జీ.శ్రీనివాసులు పేర్కొన్నారు,

టిడ్కో గృహాల్లో కొవిడ్‌ సెంటర్‌ : ఆర్డీవో
కొవిడ్‌ సెంటర్‌ కోసం టిడ్కో గృహాలను పరిశీలిస్తున్న ఆర్డీవో, కమిషనర్‌, తహసీల్దార్‌ తదితరులు

కావలి, ఏప్రిల్‌ 16: కావలి డివిజన్‌లో కరోనా వ్యాప్తి రోజురోజు పెరుగుతున్నందున పట్టణంలోని మద్దూరుపాడులో నిర్మించిన టిడ్కో గృహాల్లో కొవిడ్‌ సెంటర్‌ ఏర్పాటు చేసినట్లు ఆర్డీవో జీ.శ్రీనివాసులు పేర్కొన్నారు, టిడ్కో గృహాల్లో జరుగుతున్న కొవిడ్‌ సెంటర్‌ ఏర్పాట్లను మున్సిపల్‌ కమిషనర్‌ బీ.శివారెడ్డి, తహసీల్దారు రవికుమార్‌లతో కలిసి శుక్రవారం ఆర్డీవో పరిశీలించారు. పారిశుధ్య మెరుగుకు మున్సిపల్‌ కార్మికులు యుద్ధ ప్రాతిపదికన  పనులు చేపడుతున్నారు. అక్కడ ఎన్ని బెడ్లు ఏర్పాటు చేయాలి, వాటికి విద్యుత్‌ సౌకర్యం, ఫ్యాన్లు, మంచినీటి సరఫరా తదితర పనులు త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. మొత్తం 750 బెడ్లకు గాను ప్రస్తుతం 350 బెడ్లను  ఏర్పాటు చేస్తుండగా, అవసరమైన మేరకు చర్యలు తీసుకోవాలని చెప్పారు. కొవిడ్‌ సెంటర్‌కు అవసరమైన వివిధ శాఖల అధికారులు, సిబ్బంది నియామకం పూర్తి చేసి వారు చేట్టాల్సిన విధుల గురించి వివరించారు.


Updated Date - 2021-04-17T03:52:40+05:30 IST