ఆగస్టు లోగా జీ ప్లస్‌ 3 గృహాల అప్పగింత

ABN , First Publish Date - 2022-06-27T05:14:43+05:30 IST

పట్టణంలోని ఉప్పుచెరువు సమీపంలో నిర్మాణం జరిగి ఉన్న జీ ప్లస్‌ 3 గృహాలలో మౌలిక సదుపాయాల కల్పించి

ఆగస్టు లోగా జీ ప్లస్‌ 3 గృహాల అప్పగింత

  కందుకూరు, జూన్‌ 26: పట్టణంలోని ఉప్పుచెరువు సమీపంలో నిర్మాణం జరిగి ఉన్న జీ ప్లస్‌ 3 గృహాలలో మౌలిక సదుపాయాల కల్పించి ఆగస్టు నెలాఖరులోగా లబ్ధిదారులకు అప్పగించేందుకు వేగవంతంగా పనులు చేస్తున్నామని మున్సిపల్‌ కమిషనర్‌ ఎస్‌.మనోహర్‌ ఒక ప్రకటనలో తెలిపారు. ఇక్కడ నిర్మించిన 1408 గృహాలను ఇదివరకే కేటాయించి ఉండగా ప్రస్తుతం టిడ్కో ఆధ్వర్యంలో మౌలిక సదుపాయాల కల్పనలో భాగంగా లెవలింగ్‌ పూర్తయిం దని, డ్రైన్లు, రోడ్ల నిర్మాణ పనులు కూడా త్వరలో ప్రారంభమవుతాయన్నారు. లబ్ధిదారుల పేర్లుతో రిజిస్త్రేషన్లు కూడా ప్రారంభమయ్యాయని తెలిపారు. 300 చదరపు అడుగుల ఇళ్లకు సంబంధించి 400 గృహాలను రిజిస్ట్రేషన్‌ చేయటం జరిగిందని తెలిపారు. అదేవిధంగా 365 చదరపు అడుగులు, 430 చదరపు అడుగుల గృహాలకు సంబంధించి ఎవరైతే లబ్ధిదారు వాటా బ్యాంకులో చెల్లించి ఉన్నారో వారందరికీ కూడా రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ పూర్తి చేస్తున్నామని తెలిపారు. 365 చదరపు అడుగుల గృహాలకు సంబంధించి రూ.25 వేలు, 430 చదరపు అడుగుల గృహాలకు సంబంధించి రూ.50 వేలు ముందస్తుగా చెల్లించాల్సి ఉందని, ఆ నగదు చెల్లించని వారంతా తక్షణం చెల్లించి బ్యాంకు లోనుకు వెళ్లాలని కోరారు. ఈ ప్రక్రియ పూర్తి చేసుకున్న వారికి గృహాలను రిజిస్ట్రేషన్‌ చేయటం జరుగుతుందని వివరించారు.

Updated Date - 2022-06-27T05:14:43+05:30 IST