మ్యాప్‌ను పరిశీలిస్తున్న ఉదయభాను, టిడ్కో చైర్మన్ ప్రసన్నకుమార్ తదితరులు
ప్రభుత్వ విప్ సామినేని ఉయదభాను
జగ్గయ్యపేట, జూలై 6: జగ్గయ్యపేట బలుసుపాడురోడ్డులో ఉన్న టిడ్కో గృహసముదాయాన్ని బుధవారం ప్రభుత్వవిప్ సామినేని ఉదయభాను, కేడీసీసీ బ్యాంకు చైర్మన్ తన్నీరు నాగేశ్వరరావు, టిడ్కో చైర్మన్ ప్రసన్నకుమార్ సందర్శించారు. 3,165 ఇళ్లలో అసంపూర్తిగా ఉన్న వాటి పనులు పూర్తి చేయించి, రోడ్లు, ఇతర మౌలిక వసతులను నాలుగైదు నెలల్లో పూర్తిచేసి లబ్ధిదారులకు పంపిణీకి సిద్ధం చేయాలన్నారు. పట్టణ వైసీపీ అధ్యక్షుడు చౌడవరపు జగదీష్, పెనుగంచిప్రోలు ఎంపీపీ ఎం.గాంధీ, కౌన్సిలర్లు పాల్గొన్నారు.