టిడ్కో ఇళ్లు ఇవ్వకుండా ఎందుకు తాత్సారం

ABN , First Publish Date - 2022-08-11T06:10:09+05:30 IST

టిడ్కో ఇళ్లు ఇవ్వకుండా ఎందుకు తాత్సారం

టిడ్కో ఇళ్లు ఇవ్వకుండా ఎందుకు తాత్సారం
ఎన్టీఆర్‌ కాలనీ 6వ వార్డులో బాదుడే- బాదుడులో రావి

బాదుడే- బాదుడులో రావి

 గుడివాడ టౌన్‌ : టీడీపీ ప్రభుత్వం హయాంలో 90 శాతానికి పైగా పూర్తి చేసిన టిడ్కో ఇళ్లు పేద లకు ఇవ్వడానికి వైసీపీ ప్రభుత్వం ఎందుకు కాలయాపన చేసిందో ప్రజలకు చెప్పాలని టీడీపీ నియోజక వర్గ ఇన్‌చార్జి మాజీ ఎమ్మెల్యే రావి వెంకటేశ్వరరావు ప్రశ్నించారు. ఎన్టీఆర్‌ కాలనీ 6వ వార్డులో బుధవారం నిర్వహించిన బాదుడే- బాదుడులో రావి వెంకటేశ్వరరావు సమస్యలు అడిగి తెలుసుకున్నారు. వడ్డీలకు తెచ్చి ఇళ్లకు కడితే ఇంత వరకు అతీగతి లేదని వాపోయారు.  వైసీపీ ప్రభుత్వం మూడేళ్లుగా ఇళ్లు ఇవ్వకుండా కాలయాపన చేసి టీడీపీ ప్రభుత్వంపై నిం దలు వేయడాన్ని ప్రజలు గమనిస్తున్నారన్నారు.  కార్యక్రమంలో రాష్ట్ర తెలుగు రైతు  కార్యదర్శి చల్లగుళ్ల సుబ్రహ్మణ్యేశ్వరరావు, పొట్లూరి వెంకట కృష్ణారావు, విష్ణుమూర్తుల ద్వారక, శ్రీను, పట్టణ పార్టీ అధ్యక్షుడు దింట్యాల రాంబాబు, యార్లగడ్డ సుధారాణి, గోకవరపు సునీల్‌, రాజేశ్వరరావు, పల్లారావు, నీలవేణి తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-08-11T06:10:09+05:30 IST