ఆర్టీసీలో క్యూఆర్‌ కోడ్‌తో టికెట్‌ సేవలు ప్రారంభం

ABN , First Publish Date - 2020-07-11T10:36:17+05:30 IST

ఏపీఎస్‌ఆర్టీసీ అనంతపురం రీజియన్‌లో క్యూఆర్‌ కోడ్‌ టికెటింగ్‌ సేవలు ప్రారంభమయ్యాయి. రీజియన్‌ వ్యాప్తంగా 300 బస్సులు తిరుగుతుండగా

ఆర్టీసీలో క్యూఆర్‌ కోడ్‌తో టికెట్‌ సేవలు ప్రారంభం

అనంతపురం టౌన్‌, జూలై 10 : ఏపీఎస్‌ఆర్టీసీ అనంతపురం రీజియన్‌లో క్యూఆర్‌ కోడ్‌ టికెటింగ్‌ సేవలు ప్రారంభమయ్యాయి. రీజియన్‌ వ్యాప్తంగా 300 బస్సులు తిరుగుతుండగా తొలిరోజున శుక్రవారం 250 బస్సులకు క్యూఆర్‌ కోడ్‌ను కేటాయించారు.  ఆర్‌ఎమ్‌ సుమంత్‌  మాట్లాడుతూ కరోనా వైరస్‌ నివారణ చర్యల్లో భాగంగా నగదు రహిత పద్ధతిలో టికెట్లను కేటాయించే చర్యలు చేపడుతున్నామన్నారు.


ఇందులో భాగంగానే క్యూఆర్‌ కో డ్‌ను స్కాన్‌ చేసి పేటీఎం, గుగూల్‌-పే, ఫోన్‌-పే వంటి యాప్‌ల ద్వారా ప్రయాణికులు టికెట్‌ రుసుము చెల్లించేలా ఏర్పాటు చేశామన్నారు. బస్టాండ్లలో ప్రతి కండక్టర్‌కు క్యూఆర్‌ కోడ్‌ కేటాయిస్తామని, వారినుంచి ప్రయాణికులు క్యూఆర్‌ కోడ్‌ స్కాన్‌ చేసి నగదు రహితంగా టికెట్లు కొనుగోలు చేయొచ్చునన్నారు. త్వరలో ప్రథమ్‌ యాప్‌ కూడా అందుబాటులోకి వస్తుందన్నారు. 

Updated Date - 2020-07-11T10:36:17+05:30 IST