Advertisement
Advertisement
Abn logo
Advertisement

కొత్త బస్టాండ్‌లోనే టికెట్‌ రిజర్వేషన్‌

 ఆర్టీసీ ఆర్‌ఎం సుదర్శన్‌


సంగారెడ్డిఅర్బన్‌, నవంబరు26: సంగారెడ్డిలోని కొత్తబస్టాండ్‌ను ఆర్టీసీ మెదక్‌ రీజినల్‌ మేనేజర్‌ సుదర్శన్‌ శుక్రవారం ఆకస్మిక తనిఖీ చేశారు. ప్రయాణికులతో మాట్లాడి సమస్యలను తెలుసుకున్నారు. ఈ సందర్భంగా దూరప్రాంతాలకు వెళ్లే బస్సులకు ఓపీఆర్‌ఎస్‌ విధానంలో టికెట్‌ రిజర్వేషన్‌ చేసుకునే అవకాశాన్ని కొత్త బస్టాండ్‌లో ఏర్పాటు చేస్తే ప్రయాణికులకు సులభంగా ఉంటుందని, అందుకు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. అనంతరం ఆర్టీఏ ట్రాఫిక్‌ పోలీసులతో కలిసి ఆయన పాత బస్టాండ్‌ను తనిఖీ చేశారు. బస్టాండ్‌ సమీపంలో ఆటోలు ఆపొద్దని ఆటో యూనియన్‌ నాయకులకు కౌన్సిలింగ్‌ ఇచ్చారు. బస్టాండ్‌కు 300 మీటర్ల దూరంలో ప్రైవేటు వాహనాలు నిలపాలని సూచించారు. ఆయన వెంట డిపో మేనేజర్‌ నాగభూషణం, ఎఎంవీఐ లావణ్య, ట్రాఫిక్‌ ఎస్‌ఐ సుభాష్‌, ఉద్యోగులు ఉన్నారు.


Advertisement
Advertisement