IRCTC గుడ్ న్యూస్: ఇక నుంచి డబుల్ ఆఫర్

ABN , First Publish Date - 2022-06-06T23:54:12+05:30 IST

రైల్వే ప్రయాణికులకు ఐఆర్‭సీటీసీ(IRCTC) శుభవార్త చెప్పింది. ఇప్పటి వరకు ప్రయాణికులకు ఇచ్చే టికెట్ల పరిమితిని డబుల్ చేస్తున్నట్లు ఐఆర్‭సీటీసీ సోమవారం ప్రకటించింది. అంటే ఒక ఐడీపై ఇప్పటి వరకు అందుబాటులో ఉన్న టికెట్లకు ఇక నుంచి రెండింతల టికెట్లు బుక్ చేసుకునే వెసులుబాటు..

IRCTC గుడ్ న్యూస్: ఇక నుంచి డబుల్ ఆఫర్

న్యూఢిల్లీ: రైల్వే ప్రయాణికులకు ఐఆర్‭సీటీసీ(IRCTC) శుభవార్త చెప్పింది. ఇప్పటి వరకు ప్రయాణికులకు ఇచ్చే టికెట్ల పరిమితిని డబుల్ చేస్తున్నట్లు ఐఆర్‭సీటీసీ సోమవారం ప్రకటించింది. అంటే ఒక ఐడీపై ఇప్పటి వరకు అందుబాటులో ఉన్న టికెట్లకు ఇక నుంచి రెండింతల టికెట్లు బుక్ చేసుకునే వెసులుబాటు కల్పించింది. ఐఆర్‭సీటీసీ వెబ్‭సైట్ లేదంటే యాప్ ద్వారా టికెట్లు బుక్ చేసుకునే అవకాశం ఉంది. అయితే ఆధార్ లింక్ ఉన్న ఐడీలకు ఇక నుంచి ఒక నెలలో గరిష్టంగా 24 టికెట్లు బుక్ చేసుకోవచ్చు. ఇంతకు ముందు ఇది 12 టికెట్ల పరిమితితో ఉండేది. ఇక ఆధార్ లింక్ లేని ఐడీలకు కూడా డబుల్ ఆఫర్ లభించింది. వారికి ఇంతకు ముందు 6 టికెట్ల వరకు బుక్ చేసుకునే అవకాశం ఉండగా.. ఇక నుంచి 12 టికెట్ల వరకు బుక్ చేసుకునేందుకు అవకాశం కల్పించారు.

Updated Date - 2022-06-06T23:54:12+05:30 IST