Tik tok: హైదరాబాద్.. మెట్రో స్టేషన్‌లో ఓ యువతి టిక్ టాక్

ABN , First Publish Date - 2022-07-20T20:05:56+05:30 IST

హైదరాబాద్ (Hyderabad): మెట్రో స్టేషన్‌ (Metro Station)లో కొందరు రెచ్చిపోతున్నారు.

Tik tok: హైదరాబాద్.. మెట్రో స్టేషన్‌లో ఓ యువతి టిక్ టాక్

హైదరాబాద్ (Hyderabad): మెట్రో స్టేషన్‌ (Metro Station)లో కొందరు రెచ్చిపోతున్నారు. మెట్రో స్టేషన్లను తమ టిక్ టాక్ (Tik tok) వీడియోలకు అడ్డాగా వాడుకుంటున్నారు. ఇదే కోవలో ఓ మెట్రో స్టేషన్‌లో యువతి (young woman) చేసిన టిక్ టాక్ వీడియో వైరల్‌ (Video Viral)గా మారింది. మెట్రో స్టేషన్‌లో నిముషం కూడా ఎవరినీ ఉండనివ్వని అధికారులు ఈ యువతిని ఎలా అనుమతించారనే ప్రశ్నలు, విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అయితే ఈ వీడియోను ఎక్కడ చేశారో గుర్తించి, తగిన చర్యలు తీసుకుంటామని మెట్రో అధికారులు తెలిపారు.

Updated Date - 2022-07-20T20:05:56+05:30 IST