కరోనాతో థైరాయిడ్‌ వాపు

ABN , First Publish Date - 2020-05-23T08:05:43+05:30 IST

కొవిడ్‌-19 సోకినవారికి ‘సబ్‌ ఎక్యూట్‌ థైరాయిడైటిస్‌’ వచ్చే ప్రమాదం ఉందని ఇటలీకి చెందిన పరిశోధకులు హెచ్చరిస్తున్నారు. ఇది ఒక రకం ‘ఇన్‌ఫ్లమేటరీ థైరాయిడ్‌ వ్యాధి’. ఈ సమస్య వచ్చినవారికి ఎగువ శ్వాస మార్గం (అప్పర్‌ రెస్పిరేటరీ ట్రాక్ట్‌)లో ఇన్ఫెక్షన్‌, గొంతు నొప్పి వంటి లక్షణాలు కనిపిస్తాయని...

కరోనాతో థైరాయిడ్‌ వాపు

  • ఇటలీలో 18 ఏళ్ల మహిళకు వైరస్‌
  • కోలుకున్నాక సబ్‌ ఎక్యూట్‌ థైరాయిడైటిస్‌

లండన్‌: కొవిడ్‌-19 సోకినవారికి ‘సబ్‌ ఎక్యూట్‌ థైరాయిడైటిస్‌’ వచ్చే ప్రమాదం ఉందని  ఇటలీకి చెందిన పరిశోధకులు హెచ్చరిస్తున్నారు. ఇది ఒక రకం ‘ఇన్‌ఫ్లమేటరీ థైరాయిడ్‌ వ్యాధి’. ఈ సమస్య వచ్చినవారికి ఎగువ శ్వాస మార్గం (అప్పర్‌ రెస్పిరేటరీ ట్రాక్ట్‌)లో ఇన్ఫెక్షన్‌, గొంతు నొప్పి వంటి లక్షణాలు కనిపిస్తాయని యూనివర్సిటీ హాస్పిటల్‌ ఆఫ్‌ పీసాకు చెందిన ఫ్రాన్సెస్కో లత్రోఫా తెలిపారు. సాధారణంగా ఏవైనా వైరల్‌ ఇన్ఫెక్షన్లకు గురైనప్పుడు ఈ సమస్య వస్తుందని.. కొవిడ్‌-19తో కూడా అలా వచ్చే అవకాశం ఉన్నట్టు ఇప్పుడు తేలిందని ఫ్రాన్సెస్కో తెలిపారు. కరోనా బారిన పడిన 18 ఏళ్ల మహిళ.. పూర్తిగా కోలుకున్నాక ఈ సమస్య వచ్చినట్టు తాము గుర్తించామని వివరించారు. మనకు తెలిసిన హైపో, హైపర్‌  థైరాయిడ్‌ సమస్యలకు భిన్నమైనది ఇది. 


వారి నుంచి కూడా..

కరోనా సోకినా ఎలాంటి లక్షణాలూ కనిపించనివారి నుంచి కూడా వస్తువుల ఉపరితలాలకు వైరస్‌ వ్యాపిస్తుందని తాజా అధ్యయనంలో తేలింది. విదేశాల్లో చదువుకోవడానికి వెళ్లి అక్కడి నుంచి చైనాకు వచ్చిన ఇద్దరు విద్యార్థులకు పరీక్ష చేయగా.. పాజిటివ్‌ వచ్చింది. వైద్యపరీక్షలు చేయడానికి ముందు వారున్న హోటల్‌ గదులను పరిశీలించగా.. అందులో వారు ఏయే ప్రదేశాలను తాకారో ఆ ప్రదేశాల్లో కొన్ని చోట్ల వైరస్‌ వ్యాపించినట్టు శాస్త్రజ్ఞులు గుర్తించారు. ఇది ప్రమాదకర సంకేతం అని.. లాక్‌డౌన్‌ ఆంక్షలు సడలించిన నేపథ్యంలో ప్రజా రవాణా వంటివాటిని ఆశ్రయించేవారు ఈ ముప్పును దృష్టిలో పెట్టుకోవాలని వైద్యనిపుణులు హెచ్చరిస్తున్నారు. అమెరికా సెంటర్స్‌ ఫర్‌ డిసీజ్‌ కంట్రోల్‌ అండ్‌ ప్రివెన్షన్‌కు (సీడీసీ) చెందిన ‘ఎమర్జింగ్‌ ఇన్ఫెక్షస్‌ డిసీజెస్‌’ జర్నల్‌లో ఈ అధ్యయన ఫలితాలు ప్రచురితమయ్యాయి. 

Updated Date - 2020-05-23T08:05:43+05:30 IST