తమిళనాడులో వచ్చే మూడు గంటల్లో అతి భారీవర్షాలు...వాతావరణశాఖ Red warning

ABN , First Publish Date - 2021-11-11T13:44:21+05:30 IST

తమిళనాడు రాష్ట్రంలో వచ్చే మూడు గంటల్లో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ నుంచి అతి భారీవర్షాలు కురిసే అవకాశముందని భారత వాతావరణశాఖ (ఐఎండీ) గురువారం హెచ్చరించింది....

తమిళనాడులో వచ్చే మూడు గంటల్లో అతి భారీవర్షాలు...వాతావరణశాఖ Red warning

చెన్నై: తమిళనాడు రాష్ట్రంలో వచ్చే మూడు గంటల్లో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ నుంచి అతి భారీవర్షాలు కురిసే అవకాశముందని భారత వాతావరణశాఖ (ఐఎండీ) గురువారం హెచ్చరించింది. వచ్చే మూడు గంటల్లో తమిళనాడులోని తిరువల్లూరు, చెన్నై, చెంగల్‌పట్టు, కాంచీపురం జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన అతి భారీ వర్షం కురిసే అవకాశం ఉందని ఐఎండీ అధికారులు గురువారం తెల్లవారుజామున 3.55 గంటలకు విడుదల చేసిన వాతావరణ బులెటిన్‌లో తెలిపారు.రానున్న మూడు గంటల్లో తమిళనాడులోని కడలూరు, కళ్లకురిచ్చి, విల్లుపురం, రాణిపేట్, వెల్లూరు, తిరువణ్ణామలై, కన్యాకుమారి, తిరునెల్వేలి, తెన్‌కాసి జిల్లాల్లో ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది. 


వాతావరణశాఖ ముందుగా చెన్నైకి రెడ్ వార్నింగ్ జారీ చేసింది, గురువారం చెన్నై నగరంలో ఉరుములతో కూడిన భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది.చెన్నై సమీప ఉత్తర ప్రాంతాల్లో రానున్న 48 గంటల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేస్తున్నట్లు ఐఎండీ తెలిపింది.ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం అల్పపీడనంగా మారే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ వెల్లడించింది. ఇప్పటికే గత మూడు రోజులుగా వర్షాలు కురుస్తున్నాయి.వచ్చే 12 గంటల్లో ఇది నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం పశ్చిమ వాయువ్య దిశగా పయనించి గురువారం తెల్లవారుజామున ఉత్తర తమిళనాడు తీరానికి చేరుకుంది.


నాగపట్టణంలో 310 మిల్లీమీటర్లు, తిరుపూండిలో 306 మిల్లీమీటర్లు, కారైకల్‌లో 287 మిల్లీమీటర్లు, తలనాయర్‌లో 236.2మిల్లీమీటర్లు, అతిరామపట్టినంలో 129 మిల్లీమీటర్లు, కడలూరులో 98 మిల్లీమీటర్లు, ఎంఒ పాండిచ్చేరిలో 95 మిల్లీమీటర్లు, చెన్నైలోని నుంగంబాక్కంలో 27 మిల్లీమీటర్లు వర్షపాతం నమోదైంది.నవంబర్ 12 నుంచి 14 వరకు తమిళనాడులోని పలు ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉంది. తమిళనాడు, పుదుచ్చేరి, కారైకాల్‌లోని కొన్ని ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడే అవకాశం ఉంది.తమిళనాడ రాష్ట్రంలో భారీ వర్షాల కారణంగా మరణించిన వారి సంఖ్య 12 కు చేరుకుందని రెవెన్యూ, విపత్తు నిర్వహణ శాఖ మంత్రి కెకెఎస్‌ఎస్‌ఆర్ రామచంద్రన్ తెలిపారు.


Updated Date - 2021-11-11T13:44:21+05:30 IST